Last Updated:

Mega Fans : గుడివాడలో హై టెన్షన్ వాతావరణం.. మెగా ఫ్యాన్స్ VS పోలీసులు

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో మాట్లాడుతూ.. ఏపీ సర్కారుపై పలు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. పోలవరం, ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని.. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమాలపై పడుతున్నారెందుకని ఆయన మాట్లాడారు.

Mega Fans : గుడివాడలో హై టెన్షన్ వాతావరణం.. మెగా ఫ్యాన్స్ VS పోలీసులు

Mega Fans : మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో మాట్లాడుతూ.. ఏపీ సర్కారుపై పలు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. పోలవరం, ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని.. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమాలపై పడుతున్నారెందుకని ఆయన మాట్లాడారు. అయితే ఈ వ్యాఖ్యలపై వైకాపా నేతలు వరుసగా మాటల యుద్ధానికి దిగుతూ.. చిరంజీవిపై విమర్శలు చేస్తున్నారు.

కాగా వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కొడాలి నాని మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలోని పకోడీగాళ్లు ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ గుడివాడలో అభిమానులు ఆందోళనకు దిగారు. పట్టణంలో ర్యాలీని చేపట్టారు. జై చిరంజీవ.. కొడాలి నాని డౌన్ డౌన్.. అంటూ నినాదాలు చేశారు. చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలకు కొడాలి నాని బహిరంగ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, మెగా ఫ్యాన్స్ కు మధ్య తోపులాట జరిగింది. చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవితో పాటు పలువురు అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు.

దీంతో పోలీసు వాహనానికి అడ్డంగా రోడ్డుపై పడుకుని అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన మెగా ఫ్యాన్స్ ను నిలువరించడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. ప్రస్తుతం గుడివాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు విజయవాడలో కూడా మెయిన్ రోడ్డుపై చిరంజీవి అభిమానులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వంగవీటి రంగా విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వచ్చే ఎన్నికల్లో చిరంజీవి, రంగా అభిమానుల ఓట్లతో కొడాలి నానికి బుద్ధి చెపుతామని హెచ్చరించారు.