Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. నేటి నుంచి నాలుగు రోజులపాటు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. అల్పపీడన ప్రభావంతో నేటి నుంచి నాలుగు రోజులపాటు ఏపీలో మరియు తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని భారత వాతారణ కేంద్రం వెల్లడించింది.
Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. అల్పపీడన ప్రభావంతో నేటి నుంచి నాలుగు రోజులపాటు ఏపీలో మరియు తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని భారత వాతారణ కేంద్రం వెల్లడించింది. ఏపీలో దక్షిణ కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతారణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే నెల్లూరు తిరుపతి ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరోవైపు ఈశాన్య రుతుపవనాలు సైతం ఏపీలోకి ప్రవేశించి అన్ని జిల్లాల్లోకి వ్యాపిస్తున్నాయని ఏపీ వెదర్ మ్యాన్ తెలపగా ఆ విషయాన్ని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
కాగా తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. వర్షాలు తగ్గడంతో ఏపీ, తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా, రాత్రివేళ చలి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో నేటి నాలుగు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కరిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతారణ కేంద్రం సూచించింది. ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడనాల వల్ల భారీ వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతోంది దానితో ఏపీలోని నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కోస్తా భాగాల్లో ఈ అల్పపీడనం ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఈసారి అల్పపీడనానికి ఉత్తర భాగంలో ఉపరితల ఆవర్తనం ఉండటం వలన వర్ష తీవ్రత కోస్తాంధ్ర ప్రాంతంలో అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో నవంబర్ 1 నుంచి మూడు, నాలుగు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ లో ఆకాశాన్ని పాక్షికంగా మేఘాలు కమ్మేశాయి. నగరంలో ఉదయం వేళ దట్టమైన పొగమంచు ఏర్పడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో గరిష్ట ఉష్ణోగ్రత 29 కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలుగా నమోదైంది. గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో చల్ల గాలులు వీస్తున్నాయి.
ఇదీ చదవండి 15 రోజుల్లో తెరాస ప్రభుత్వాన్ని పడగొడతా- రాజగోపాల్ రెడ్డి