Home / amaravathi
ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయ హీట్ మొదలయ్యింది. ఓడిన చోటే గెలుపు వెతుక్కోవాలంటూ టీడీపీ.. మరోమారు అధికారంలోకి రావాలని వైసీపీ పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల అధినేతలు ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు.
Amaravati: అమరావతిలో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య చిచ్చు రేగింది. దీంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ సవాళ్లు ప్రతి సవాళ్ల నడుమ అమరావతిలో టెన్షన్ నెలకొంది.
ఒక వైపు ప్రతిపక్ష పార్టీలన్నీ అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు అధికారంలోని వైకాపా మాత్రం మూడు రాజధానులను కొనసాగించలంటూ పట్టుబట్టింది. ఈ తరుణంలోనే కోర్టు కేసులు, వివాదాలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి.
భారత్ రాష్ట్రసమితి అధినేత కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్దమయింది.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేసింది.
రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ మార్పులపై రెండు రోజుల్లో గ్రామ సభలు నిర్వహించి సవరణలపై రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి రైతులు తాము చేస్తున్న పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. .పోలీసుల తీరుకు నిరసనగా పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టుగా అమరావతి జేఏసీ ప్రకటించింది.
ఏడేళ్లకిందట ఏపీ రాజధానిగా అమరావతి కి ప్రధాని మోదీ శంకుస్దాపన చేస్తే పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనమయిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేసారు.
రాజధాని అమరావతిపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. ధర్మాసనం ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని రైతులు హైకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. రేపటిదినం త్రిసభ్య ధర్మాసనం కేసును విచారించనుంది.
ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదురావు వింత వ్యాఖ్యలు చేశారు. విశాఖ రాజధాని కోసం తాను రాజీనామాకు సిద్దమని ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా అరసవళ్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ఈ మాటలు వ్యాఖ్యానించారు.