Home / Rain Alert
Heavy rains in Telangana and Andhra Pradesh: తెలంగాణ, ఏపీలో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమై తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. హైదరాబాద్‌లో అంబర్ పేట, తెల్లాపూర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, హఫీజ్ పేట్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, సికింద్రాబాద్, రామంతాపూర్, ఎస్సార్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. ఎస్.ఆర్. నగర్, […]
Telangana and Andhra Pradesh States Weather Reports: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్. తెలంగాణతో పాటు ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న 5 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, యానాం ప్రాంతాల్లో గంటకు […]
Rain alert to Andhra Pradesh & Telangana: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున ఏపీతో పాటు తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. మంగళవారం దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు చోట్ల 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కొన్ని […]
Rain : కొన్ని రోజులుగా ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు ఉపశమనం కలిగింది. ఇవాళ హైదరాబాద్‌లోని పలుచోట్ల వర్షం కురిసింది. దీంతో నగర వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హిమయత్‌నగర్, కోఠి, అమీర్‌పేట, బోరబండ, జూబ్లీహిల్స్, ఎల్బీనగర్, హయత్‌నగర్, మేడ్చల్, విద్యానగర్, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఖైరతాబాద్‌లోని ఓ హోటల్ వద్ద కారుపై చెట్టు కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సురక్షితంగా బయటపడ్డారు. పలు […]
Rain Alert for Telangana: తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు జారీ చేసింది. అదే విధంగా పలు జిల్లాల్లో మరికాసేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో క్యుమలోనింబస్ మేఘాలు కమ్ముకున్నాయని […]
Rain Alert in Andhra Pradesh and Telangana States for Five Days: గత నెల రోజులుగా ఎండలు మండుతున్నాయి. దీంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ సమయంలో హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. భూ ఉపరితం హీట్ ఎక్కడంతో పాటు ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ మూడు నుంచి ఐదు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే నేటి నుంచి రెండు రోజుల పాటు […]
IMD : మండుతున్న ఎండలు, ఉక్కపోత వాతావరణం నేపథ్యంలో వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. భూ ఉపరితలం వేడెక్కడంతో పలు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపటి నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే వీలుందని తెలిపింది. 4వ తేదీన వాన ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల కారణంగా 2, 3 తేదీల్లో […]
Rain : వికారాబాద్ నియోజకవర్గంలోని మోమిన్‌పేట, నవాబుపేట మండలాల్లో వడగండ్ల వాన కురిసింది. ఈదురు గాలులు వీయడంతో నవాబుపేట మండలం చిట్టిగిద్ద గ్రామ సమీపంలో భారీ చెట్టు నేలకొరిగింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో కూడా వడగండ్ల వాన కురిసింది. ఉరుములు మెరుపులతో మొదలైన వాన దాదాపు గంట సేపు కురిసింది. దీంతో జహీరాబాద్ పట్టణంలోని ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. జహీరాబాద్‌తోపాటు మునిపల్లి, ఝరాసంగం మండలాల్లో మోస్తరు […]
Rain Alert : రాష్ట్రంలో పలుచోట్ల వర్ష బీభత్సం సృష్టించింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం వడగండ్ల వాన కురిసింది. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తుండగా, ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయి. మంచిర్యాల, కొమురంభీం, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సాయంత్రం వడగండ్ల వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలకు పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల మార్కెట్ యార్డులో ఉన్న ధాన్యాలు, మొక్కజొన్న, మిర్చి తడిసిపోయాయి. […]
Rain Alert : రాష్ట్రంలో కొన్ని రోజుల నుంచి భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రేపు, ఎల్లుండి ఎండలు కాస్త తగ్గుముఖం పట్టనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో రానున్న రెండు రోజుల పాటు వానలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురనున్నాయని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షాలు కురుస్తాయని […]