Home / Tirupati
Varalakshmi Vratham: తిరుపతి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 8న నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్టు టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం తెలిపారు. తిరుచానూరులోని ఆస్థానమండపంలో సోమవారం జేఈవో వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లపై శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుత.. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి కుంకుమ, గాజులు, […]
Vijay Devarakonda: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే కాంబోలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్ డమ్’. పాన్ ఇండియా లెవల్ లో జూలై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో భాగంగా తిరుపతిలో ఇవాళ భారీ ఈవెంట్ ను మూవీ మేకర్స్ సిద్ధం చేశారు. అందులో భాగంగా విజయ్ దేవరకొండకు చేదు అనుభవం ఎదురైంది. గిరిజన సంఘాల నుంచి నిరసన సెగ తగిలింది. గతంలో ఓ మూవీ ప్రమేషన్ లో విజయ్ దేవరకొండ గిరిజనులను […]
Leopard Attack Tirumala: తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపింది. తిరుమలలోని అలిపిరి ఎస్వీ జూ పార్క్ రోడ్డులో బైక్ పై వెళ్తున్న యువకుడిపై ఒక్కసారిగా చిరుత దాడికి యత్నించింది. అయితే అదృష్టవశాత్తూ యువకుడు తృటిలో తప్పించుకున్నాడు. ఈ ప్రమాద సమయంలో దృశ్యాన్ని బైక్ వెనుక వస్తున్న కారులో ఉన్న ప్రయాణికులు మొబైల్ వీడియోలో రికార్డు చేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులను ఆందోళనకు గురి చేస్తుంది. […]
Technical fault in Indigo Flight: తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానంలోని పైలెట్ అప్రమత్తంగా వ్యవహరించి, దాదాపు 40 నిమిషాల పాటు విమానాన్ని గాల్లో చక్కర్లు కొట్టించాడు. చివరికి తిరిగి మళ్లీ తిరుపతిలోనే సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ల్యాండింగ్ క్లియరెన్స్ కాస్త ఆలస్యం కావడంతో పైలెట్ విమానాన్ని […]
Murder: తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. ఆటోనగర్‌లోని గొల్లవానికుంటలో కుమారుడి చేతిలో తల్లి హతమైంది. తల్లిపై కొడుకు పిడిగుద్దులతో దాడి చేసి ఆపై గొంతు నులిమి హత్య చేసినట్లు తెలుస్తోంది. అక్రమ సంబంధాన్ని జీర్ణించుకోలేక తల్లిని నిలదీసి అఘాయిత్యానికి పాల్పడిన సమాచారం. మృతురాలు చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలంలోని మోటమల్లెల పంచాయతీ నగరి గ్రామానికి చెందిన శారద(37) రేణిగుంట రోడ్డులోని మారుతీ షోరూమ్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా విధులు నిర్వహిస్తోంది. వివరాల ప్రకారం.. తిరుపతి జిల్లాలొని చిన్నగొట్టిగల్లు మండలం […]
South Central Railway will run special trains between Nanded and Tirupati: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని దర్శించుకునే భక్తుల కోసం రైల్వే శాఖ స్పెషల్ ట్రైన్ నడపనుంది. ప్రస్తుతం నాందేడ్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్ నడపేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ స్పెషల్ ట్రైన్ .. నాందేడ్ […]
Tirumala Ghat Road: తిరుమల ఘాట్ రోడ్డులో ఇవాళ ఘోర ప్రమాదం తప్పింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఉన్న వినాయకస్వామి ఆలయం సమీపంలో ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారులోని నలుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తిరుమలలో స్వామివారిని దర్శించుకుని తిరుపతికి వస్తుండగా ఘటన జరిగిందని సమాచారం. బాధితులకు ప్రాణాపాయం లేదని వైద్యులు […]
TTD Board: తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమత ఉద్యోగులపై కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పుట్టినరోజు సందర్బంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం అర్చకులు రంగనాయక మండపంలో వేదాశీర్వచనం చేసి శ్రీవారి శేషవస్త్రం, ప్రసాదం అందించారు. ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్టు బండి సంజయ్ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో జివించాలని, దేశం కోసం, సనాతన ధర్మ రక్షణ కోసం కలిసికట్టుగా ఉంటూ చేదోడు వాదోడుగా ఉండాలన్నారు. […]
Tirupati Govindaraja Swamy Temple: తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. సన్నిధి వీధిలోని ఓ షాపులో మంటలు వ్యాపించాయి. అగ్నిప్రమాదం జరిగి రెండు షాపులు దగ్ధం అయ్యాయి. ఆ మంటలు కాస్త ఆలయం ముందు ఏర్పాటు చేసిన చలువ పందిళ్లకు అంటుకుని కొంతమేర కాలిపోయాయి. దీంతో స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ప్రమాదంలో గోవిందరాజస్వామి ఆలయం వెలుపల పందిళ్లు కొంతమేర కాలిపోయాయి. మరోవైపు […]
September Month Darshanam tickets Release Today: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. శ్రీవారి దర్శనానికి సంబంధించి సెప్టెంబర్ నెల కోటాను ఇవాళ విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే వివిధ రకాల సేవలకు సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లో ఉంచనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది. కాగా ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్లను విడుదల చేయనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు […]