Family Star : “ఫ్యామిలీ స్టార్”గా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ..
టాలీవుడ్ యంగ్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్.. ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి చిత్రాలతో స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత విజయ్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ బాటపట్టినప్పటికి తనదైన
Family Star : టాలీవుడ్ యంగ్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్.. ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి చిత్రాలతో స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత విజయ్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ బాటపట్టినప్పటికి తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఇక రీసెంట్ గానే సమంతతో కలిసి “ఖుషి” మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే కెరీర్ లో ఎక్కువగా యూత్ కనెక్ట్ అయ్యే స్టోరీలే చేసిన విజయ్ ఇప్పుడు రూటమార్చినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా చేరువవ్వడానికి గర్ మర్చినట్లు అర్ధం అవుతుంది.
ఇప్పటికే గీత గోవిందం సినిమాలో పక్కా ఫ్యామిలీ టైప్ కుర్రాడిలా అదరగొట్టిన విజయ్.. రీసెంట్ గా ఖుషితో పెళ్లి తర్వాత వచ్చే పరిస్థితుల గురించి చెబుతూ మరింత చేరువయ్యాడు. ఇక ఇప్పుడు ఏకంగా “ఫ్యామిలీ స్టార్” అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. “గీత గోవిందం” తర్వాత మరోసారి పరశురామ్ దర్శకత్వంలో విజయ్ ఒక సినిమాని చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి టైటిల్ ని ఫిక్స్ చేసి.. గ్లింప్స్ వీడియోని రిలీజ్ చేశారు.
ఇక ఈ చిత్రంలో సీతారామం బ్యూటీ “మృణాల్ ఠాకూర్” హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. అలానే గోపీ సుందర్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక గ్లింప్స్ వీడియోని గమనిస్తే.. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ కూడా ఫ్యామిలీ మ్యాన్ గా కనబడుతూనే.. యాక్షన్ గా అదరగొట్టారు.
`లైన్ లో నిలబడి ఉల్లిపాయలు తేవడాలు, టైమ్ కు లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూల్ కు పంపించడాలు అనుకున్నావా సెటిల్ మెంట్ అంటే అని అజయ్ ఘోస్ చెప్పే డైలాగ్.. ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషి కాదా, పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా, ఏ ఐరెన్ వంచాలా ఏంటి అంటూ విజయ్ చెప్పే డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఇక చివర్లో మృణాల్ ఠాకూర్ “ఏవండీ” అని విజయ్ ని పిలవడం అయితే మ్యాజిక్ చేసినట్లు అనిపిస్తుంది అని చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది.