Vande Bharat train: సాంకేతిక లోపంతో నిలిచిన వందే భారత్ రైలు
వంద రైళ్లు...వంద మార్గాల్లో..ఇది వందే భారత్ రైళ్లను పట్టాలపైకి పరిగెత్తించడమే కేంద్రం ప్రభుత్వ ఆలోచన. దీంతో ఇప్పటి వరకు మూడు రైళ్లను ఆచరణలోకి తీసుకొచ్చింది. గడిచిన వారం రోజులుగా వందే భారత్ రైళ్లకు కష్టాలు మొదలయ్యాయి
Vande Bharat Express: వంద రైళ్లు…వంద మార్గాల్లో..ఇది వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను పట్టాలపైకి పరిగెత్తించడమే కేంద్రం ప్రభుత్వ ఆలోచన. దీంతో ఇప్పటి వరకు మూడు రైళ్లను ఆచరణలోకి తీసుకొచ్చింది. గడిచిన వారం రోజులుగా వందే భారత్ రైళ్లకు కష్టాలు మొదలయ్యాయి. ఏదో ఒక కారణంతో వందే భారత్ రైలు పట్టాలపై ఆగి విమర్శలకు తావిస్తుంది.
తాజాగా న్యూఢిల్లీ-వారణాసి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 22436లో తలెత్తిన సాంకేతిక లోపంతో ఉత్తరప్రదేశ్‌లోని దన్ కౌర్, వైర్ స్టేషన్ల మధ్య రిజర్వేషన్ బోగి 8లోని ట్రాక్షన్ మోటార్‌లో బేరింగ్ లోపం తలెత్తింది దీంతో రైలు పట్టాలుపై 6గంటల పాటు ఆగిపోయింది. ప్రయాణీకులను శతాబ్ది రైలు ద్వారా మరో స్టేషన్ కు తరలించారు. ఎన్‌సీఆర్ టీమ్‌ను రప్పించి బేరింగ్ జామ్‌ను సరి చేసిన అనంతరం రైలును సమీపంలోని రైల్వే జంక్షన్ కు తరలించారు. ర్యాక్‌ను మెయింటెనెన్స్ డిపోకు తరలించిన వెంటనే సాంకేతక లోపంపై సమగ్ర విచారణ జరుగుతుందని రైల్వే శాఖ ప్రకటనలో తెలిపింది.
గత వారం రోజుల్లో గాంధీనగర్ మార్గంలో పయనించే వందే భారత్ రైలు రెండు పర్యాయాలు ఆగిపోయింది. ఒకసారి గేదెలను ఢీకొనడంతో, మరో సారి ఆవును ఢీకొనడంతో రైలు నిలిచిపోయింది. ఘటనతో రైలు ముందు భాగం దెబ్బతినింది. అందమైన ఆకృతి కోసం ప్లాస్టిక్ వినియోగించడంతో ఢీకొన్న సమయంలో ముందు పార్టు ఊడిపోయింది. వరుస ఘటనలు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు తయారీపై రైల్వే శాఖ పెద్దగా దృష్టి సారించలేదని విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.
ఈ రైలు గంటకు 160 కి.మీ వేగాన్ని కేవలం రెండు నిమిషాల్లోనే చేరుకునేలా పట్టాలపై పరిగెడుతాయి. ఇతర రైళ్ల కంటే మెరుగైన రైడింగ్ సౌకర్యాన్ని కలిగి ఉందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Mild accident: వందే భారత్ రైలుకు స్వల్ప ప్రమాదం