Uttar Pradesh : సంచలన ఘటన.. కూతురి మామతో కలిసి పారిపోయిన నలుగురు పిల్లల తల్లి

Uttar Pradesh : కూతురు మామగారితో కలిసి నలుగురు పిల్లల తల్లి పారిపోయింది. ఇంట్లోని బంగారం, డబ్బులు, ఇతర విలువైన వస్తువులను తీసుకెళ్లింది. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పారిపోయిన ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని బుదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది. 43 ఏళ్ల మమతకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భర్త చాలా కాలం ఇంటికి దూరంగా ఉండేవాడు. ఈ క్రమంలోనే కూతురు మామ 46 ఏళ్ల శైలేంద్ర, మమత మధ్య ఏడాదిగా సంబంధం ఏర్పడింది. భర్త లేనప్పుడు వియ్యంకుడు అతడిని తన ఇంటికి పిలిచేది.
ఈ నెల 11న వియ్యంకుడు శైలేంద్రకు మమత ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. అతడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న డబ్బులు, బంగారం, విలువైన వస్తువులను తీసుకుని ఇద్దరు కలిసి పారిపోయారు. విషయం తెలుసుకున్న మమత భర్త శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన వియ్యంకుడు, వియ్యపురాలి కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఇద్దరి ఆచూకీని గుర్తించిన తర్వాత చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.