Published On:

Murder in Uttar Pradesh : ఆస్తి కోసం ఆమెకు మద్యం తాగించి.. ఆపై హత్య.. యూపీలో ఘటన

Murder in Uttar Pradesh : ఆస్తి కోసం ఆమెకు మద్యం తాగించి.. ఆపై హత్య.. యూపీలో ఘటన

Murder in Uttar Pradesh  : ల్యాండ్‌కు సంబంధించిన డబ్బు వివాదంలో ఇద్దరు వ్యక్తులు ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. సదరు మహిళకు మద్య తాగించి తర్వాత గొంతుకోసి మృతదేహాన్ని యుమునా నదిలో పడేశారు. ఈ ఘటన యూపీలో జరిగింది.

 

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా జిల్లాలో అంజలి (28) జీవనం కొనసాగిస్తోంది. తన భర్త మృతిచెందడంతో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి వద్ద ఉంటోంది. కాగా, అంజలి రియల్ ఎస్టేట్ వ్యాపారి శివేంద్ర యాదవ్ మధ్య ఓ భూమికి సంబంధించి కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. అంజలికి శివేంద్ర యాదవ్ డబ్బులు ఇవ్వాల్సి ఉండగా, డబ్బులు ఇవ్వకుండా కాలం వెళ్లదీస్తున్నాడు. దీంతో తనకు రావాల్సిన డబ్బులు వెంటనే ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది. దీంతో శివేంద్ర యాదవ్ తప్పించుకునేందుకు పథకం వేశాడు. అంజలిని హత్య చేయాలని పూనుకున్నాడు.

 

ఈ క్రమంలోనే మరో వ్యక్తి గౌరవ్‌తో కలిసి అంజలిని హత్య చేసేందుకు శివేంద్ర యాదవ్ పథకం వేశాడు. ఈ నేపథ్యంలోనే అంజలికి ఫోన్ చేసి డబ్బులు ఇస్తానని ఇంటికి రావాలని శివేంద్ర యాదవ్ చెప్పాడు. అతడి మాటలు నమ్మిన అంజలి శివేంద్ర ఇంటికి వెళ్లింది. ఇద్దరు కలిసి అంజలికి బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం ఆమె గొంతుకోసి హత్యచేసి మృతదేహాన్ని యుమునా నదిలో పడేశారు. ఈ క్రమంలో ఐదు రోజులుగా అంజలి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్య కేసు నమోదు చేశారు. పోలీసులు ఆమె ఫోన్ ట్రాకింగ్, స్కూటీ ఆధారంగా యుమునా నది వద్ద ఉన్నట్లు తేల్చారు. దర్యాప్తులో భాగంగా శివేంద్ర యాదవ్, గౌరవ్ ఆమెను హత్య చేసినట్లు గుర్తించారు.

 

దీంతో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా, అంజలిని హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. ల్యాండ్ వివాదంలో అంజలి డబ్బులు అడుగుతుండటంలో హత్య చేసినట్లు చెప్పారు. శనివారం సాయంత్రం అంజలి మృతదేహాన్ని యుమునా నదిలో నుంచి బయటకు తీశారు. ఆమె చూసిన కుటుంబ సభ్యులు, అంజలి పిల్లలు బోరున విలపించారు. తల్లిదండ్రులు లేకపోవడంతో విలపిస్తున్నారు. ఇదే సమయంలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

 

 

 

 

ఇవి కూడా చదవండి: