స్పైస్‌జెట్: వివాదాస్పదంగా మారిన స్పైస్‌జెట్ రెడ్-హాట్ గర్ల్స్ క్యాప్షన్
స్పైస్‌జెట్ తన ఫ్లైట్ అటెండెంట్‌లను ట్విట్టర్ పోస్ట్‌లో రెడ్-హాట్ గర్ల్స్"గా అభివర్ణించడం వివాదాస్పదమయింది
Spice Jet: స్పైస్‌జెట్ తన ఫ్లైట్ అటెండెంట్‌లను ట్విట్టర్ పోస్ట్‌లో రెడ్-హాట్ గర్ల్స్”గా అభివర్ణించడం వివాదాస్పదమయింది. జాతీయ మహిళా కమిషన్ విమానయాన సంస్థను ఈ ఆక్షేపణీయమైన పోస్ట్‌ను తీసివేయమని కోరింది. ప్రముఖ నటుడు ధర్మేంద్ర, ముగ్గురు స్పైస్‌జెట్ ఫ్లైట్ అటెండెంట్‌లతో పోజులిచ్చిన ఫోటోను డిసెంబర్ 18న స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ షేర్ చేసింది. “మా రెడ్-హాట్ గర్ల్స్‌తో గరం-ధరం” అని స్పైస్‌జెట్ తన విమానంలో తీసిన చిత్రానికి క్యాప్షన్ ఇచ్చింది. 87 ఏళ్ల ధర్మేంద్ర ఈ పోస్ట్‌పై స్పందిస్తూ ధన్యవాదాలు.. ఈ స్వీట్ బేబీస్‌తో అందమైన ప్రయాణం. పతా హీ నేహిం చలా కబ్ ఉడే కబ్ పహుంచ్ గయే అంటూ వ్యాఖ్యానించారు.
కొంతమంది ట్విటర్ వినియోగదారులు స్పైస్‌జెట్ ట్వీట్ యొక్క పదాలను అభ్యంతరం వ్యక్తం చేశారు, భాషను అవమానకరమైనదిగా పేర్కొన్నారు. జాతీయ మహిళా కమిషన్ (NCW) కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని పరిశీలించి, పోస్ట్‌ను తొలగించడానికి ఆదేశాలు జారీ చేయండి అంటూ ఎన్‌సిడబ్ల్యు చైర్‌పర్సన్ రేఖా శర్మ స్పైస్‌జెట్ మేనేజింగ్ డైరెక్టర్‌కు లేఖ రాశారు.