Last Updated:

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణకు తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు బిగ్‌ షాక్‌. మహేష్‌ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం నుంచి సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది.

Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణకు తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక

Super Star Krishna: సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు బిగ్‌ షాక్‌. మహేష్‌ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం నుంచి సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది.

దానితో సూపర్ స్టార్ కృష్ణ ను కుటుంబ సభ్యలు హైదరాబాద్‌ లోని కాంటినెంటల్‌ ఆస్పత్రికి తరలించారు. కాంటినెంటల్‌ ఆస్పత్రిలో సూపర్ స్టార్ కృష్ణకు చికిత్స చేస్తున్నారు వైద్యులు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న కృష్ఱ.. ఇటీవల తన భార్య ఇందిరాదేవి మృతి చెందడంతో కృంగిపోయారు. దీనితో ఆయన ఆరోగ్యం క్షిణించినట్లు తెలుస్తోంది. కాగా సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో ఘట్టమనేని వారి కుటుంబంలో వరుసగా విషాదలు నెలకొంటున్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలో కృష్ణ పెద్ద కొడుకు, మహేష్‌ బాబు సోదరుడు అయిన రమేష్ బాబు కన్నుమూశారు. అంతకు ముందు సినీ నిర్మాత, దర్శకురాలు అయిన విజయ నిర్మల మరణించారు. అంతే కాకుండా రీసెంట్‌గా కృష్ణ మొదటి భార్య ఇందిరమ్మ కన్నుమూశారు. ఇలా సూపర్ స్టార్ ఇంట్లో వరుసగా విషాదాలు జరుగుతుండటంతో అభిమానులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు.

ఇదీ చదవండి: ఆర్ఆర్ఆర్ చిత్రానికి సీక్వెల్ వచ్చేస్తుంది.. రాజమౌళి క్లారిటీ

 

ఇవి కూడా చదవండి: