Last Updated:

Poonam Kaur: రాహుల్ గాంధీ చేతిలో చేయి వేసి నడిచిన పూనమ్ కౌర్.. బీజేపీ రచ్చకు పూనమ్ కౌంటర్

తెలంగాణలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేయిలో చేయి వేసి మరీ నడిచి టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ వార్తల్లో నిలిచింది.

Poonam Kaur: రాహుల్ గాంధీ చేతిలో చేయి వేసి నడిచిన పూనమ్ కౌర్.. బీజేపీ రచ్చకు పూనమ్ కౌంటర్

Hyderabad: తెలంగాణలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేయిలో చేయి వేసి మరీ నడిచి టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ వార్తల్లో నిలిచింది. తెల్లటి సాదాసీదా చీర కట్టుకొని కాంగ్రెస్ స్వాదిలా మారిపోయి రాహుల్ చేతిలో చేయి వేసి మరీ నడిచిన పూనమ్ కౌర్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫొటోలను బీజేపీ మహిళా నేత ఒకరు ట్విట్టర్ లో పోస్ట్ చేయడం దుమారం రేపింది. ‘తాత అడుగుజాడల్లో’ అంటూ బీజేపీ నేత ప్రీతిగాంధీ కామెంట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ మహిళలతో ఉన్న ఫొటోలను పోస్ట్ చేస్తూ రాహుల్ కుసారీ చెప్పాలని ఆమెకు కౌంటర్ ఇస్తున్నారు.

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నాలుగోరోజు మహబూబ్ నగర్ నుంచి జడ్చర్ల వరకు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో రాహుల్ వెంట నటి పూనమ్ కౌర్ పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా సోషల్ మీడియాలో రాజకీయాల పై తన అభిప్రాయాలను వెల్లడించడంలో యాక్టివ్‌గా ఉండే పూనమ్ కౌర్ రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతే కాదు రాహుల్ గాంధీతో పాటు ఆయన చేయిలో చేయి కలుపుతూ నడుస్తూ అందరిని తనవైపు తిప్పుకునేలా చేసింది. రాష్ట్రంలోని చేనేత కార్మికుల సమస్యల గురించి పూనమ్ కౌర్ పాదయాత్రలో నడుస్తూ రాహుల్ గాంధీతో మాట్లాడారు. అందుకే చేనేతలు నేసిన సాదా కాటన్ తెల్లటి చీరను ధరించి కనిపించింది. త్వరలో సోనియా గాంధీని కలవాలని తనకు రాహుల్ సూచించారని ఆమె వెల్లడించారు.

ఈ మొత్తం వివాదానికి కారణమైన పూనం కౌర్ తాజాగా స్పందించారు. పాదయాత్ర సందర్భంగా రాహుల్ ను కలిసిన సందర్భంలో ఆయనతో పాటు నడుస్తూ ఆ చేతిని ఎందుకు పట్టుకున్నాన్న దానిపై పూనమ్ కౌర్ స్పందించారు. ‘తాను పాదయాత్రలో కాలు జారి కింద పడబోతే రాహుల్ తన చేతిని పట్టుకున్నారని, దీనికి ఇంత రాద్ధాంతం చేస్తారా?’ అంటూ ప్రశ్నించారు. చేనేత వస్త్రాల పై జీఎస్టీ ఎత్తివేతకు రాహుల్ హామీ ఇచ్చినందునే తాను జోడో యాత్రకు సంఘీభావం తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. రాహుల్ చేయి పట్టుకొని నడవడం, తన చేయిపట్టి రాహుల్ లాగడం వంటి వాటి పై బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని ఆమె తిప్పికొట్టారు. మహిళ పట్ల రాహుల్ వ్యవహరించే మర్యాద, గౌరవం తన హార్ట్ ను టచ్ చేశాయని కూడా చెప్పారు. ఈ విషయంలో బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు వారి విచక్షణకే విడిచిపెడుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా పూనమ్ రియాక్టు కావడంతో బీజేపీ నేతలు ఇప్పుడు డిఫెన్స్ లో పడిపోయారు.

ఇవి కూడా చదవండి: