Last Updated:

Dulquer Salman : ప్రభాస్ ‘కల్కి’ సినిమాలో దుల్కర్ సల్మాన్.. ఏం చెప్పారంటే ?

ప్రముఖ మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. మమ్ముట్టి తనయుడుగా ఇండస్ట్రిలోకి వచ్చినప్పటికీ.. తనదైన శైలిలో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ సినిమాలు తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చెయ్యడం వల్ల తెలుగులో కూడా మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు.

Dulquer Salman : ప్రభాస్ ‘కల్కి’ సినిమాలో దుల్కర్ సల్మాన్.. ఏం చెప్పారంటే ?

Dulquer Salman : ప్రముఖ మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. మమ్ముట్టి తనయుడుగా ఇండస్ట్రిలోకి వచ్చినప్పటికీ.. తనదైన శైలిలో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ సినిమాలు తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చెయ్యడం వల్ల తెలుగులో కూడా మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. అయితే మహనటితో తెలుగు సినీ పరిశ్రమకు కూడా పరిచయం అయ్యాడు. ఇటీవలే సీతారామం సినిమాతో దుల్కర్ సల్మాన్ తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో దుల్కర్ కు విపరీతమైన అభిమానం దక్కింది.

ఇప్పుడు దుల్కర్ కింగ్ అఫ్ కోత.. అనే మాస్ యాక్షన్ డ్రామా సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ఆగస్టు 24న రిలీజ్ కాబోతుంది. మొదటి సారి దుల్కర్ ఫుల్ మాస్ రోల్ లో నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రాన్ని వేఫరెర్‌ ఫిలిమ్స్, జీ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. షాన్ రెహ్మాన్‌, జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా.. ప్రసన్న, ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉషా, చెంబన్ వినోద్‌, గోకుల్ సురేశ్‌, షమ్మీ తిలకన్‌, శాంతి కృష్ణ, వడా చెన్నై శరన్‌, అనిఖా సురేంద్రన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

King of Kotha

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దుల్కర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘కల్కి’ లో మీరు ఉన్నారా ? అని ప్రశ్నించగా.. దుల్కర్ అవును అని కానీ.. కాదు అని కానీ చెప్పక పోవడం గమనార్హం. అలానే ఆయన మాట్లాడుతూ..  తాను ‘కల్కి’ సెట్స్ ని సందర్శించానని.. నాగ్ అశ్విన్ ఆలోచన విధానం పూర్తిగా భిన్నంగా ఉందని చెప్పాడు. నాగ్ అశ్విన్ కి తప్ప మరెవరికి అలాంటి ఆలోచన రాదని అన్నాడు. మరి సినిమాలో మీకు ఎవరితోనైనా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా? అని దుల్కర్ సల్మాన్ యాంకర్ అడిగితే.. ఇప్పుడు దాని గురించి మాట్లాడకూడదని, సినిమాలో తాను ఉన్నానో లేదో తనకు తెలియదని, అది మూవీ టీమే చెప్పాలని అన్నాడు. దీంతో దుల్కర్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇటీవల విడుదలైన ప్రభాస్ ‘కల్కి 2898’ ఫస్ట్ గ్లిమ్స్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలను పెంచేసింది. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు ఫస్ట్ గ్లిమ్స్ తోనే కన్ఫామ్ చేసేసారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సుమారు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుండగా.. అమితాబచ్చన్, కమలహాసన్, దిశా పటాని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.