Last Updated:

Airtel Payments Bank : 55.4 మిలియన్లకు చేరిన ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ వినియోగదారు సంఖ్య ..

బ్యాంకింగ్ లైసెన్స్‌తో తన సేవలను విస్తరిస్తూ పనిచేస్తున్న భారతదేశంలోని ఏకైక లాభదాయక మల్టీ-సెగ్మెంట్ ఫిన్‌టెక్ ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, దృఢమైన పనితీరును మరో త్రైమాసికంలో సాధించింది. ఒక ముఖ్యమైన మైలురాయిగా, మొదటిసారి బ్యాంక్ త్రైమాసిక ఆదాయం 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో

Airtel Payments Bank : 55.4 మిలియన్లకు చేరిన ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్  వినియోగదారు సంఖ్య ..

Airtel Payments Bank : బ్యాంకింగ్ లైసెన్స్‌తో తన సేవలను విస్తరిస్తూ పనిచేస్తున్న భారతదేశంలోని ఏకైక లాభదాయక మల్టీ-సెగ్మెంట్ ఫిన్‌టెక్ ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, దృఢమైన పనితీరును మరో త్రైమాసికంలో సాధించింది. ఒక ముఖ్యమైన మైలురాయిగా, మొదటిసారి బ్యాంక్ త్రైమాసిక ఆదాయం 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.400 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే ఇది 41% వృద్ధి చెందింది. అదే విధంగా ఏడాది నుంచి ఏడాదితో పోల్చితే 2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో బ్యాంక్ లాభాలు 143% పెరిగాయి.

వినియోగదారుల డిపాజిట్లు రూ.1,922 కోట్లకు పెరిగాయి. కొత్తగా వినియోగదారులు మదుపు చేస్తుండడంతో డిపాజిట్ల విలువ మొత్తం పెరిగింది. బ్యాంక్ ఇప్పుడు 55.4 మిలియన్ల మేర నెలవారీ లావాదేవీలు చేసే వినియోగదారులను కలిగి ఉంది. వార్షిక ప్రాతిపదికన 2,381 బిలియన్ వార్షిక స్థూల వ్యాపార విలువ (GMV) మరియు వార్షిక ప్రాతిపదికన రూ.1,600 కోట్ల కన్నా ఎక్కువ రాబడి గడించింది.

బ్యాంక్ కోసం, డిజిటల్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో కూడిన డిజిటల్ ఆఫర్‌లను దృఢంగా స్వీకరిస్తూ రావడంతో ఈ రాబడి వృద్ధి చెందుతోంది. బ్యాంక్ తన అనుకూలీకరించిన ప్లాన్‌లకు బలమైన డిమాండ్‌ను నమోదు చేయగా, ఇది బ్యాంక్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా వినియోగదారులు అదనపు చెల్లింపు చేయడం ద్వారా వార్షిక ప్రాతిపదికన బీమా వంటి అదనపు ప్రయోజనాలను పొందేందుకు వీలు కల్పిస్తుంది.

Top Airtel Postpaid Mobile Phone Simcard Dealers in Gonda - Best Airtel Postpaid Mobile Phone Simcard Dealers - Justdial

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సీఈఓ అనుబ్రత బిస్వాస్ మాట్లాడుతూ.. ఈ త్రైమాసికంలో మా వృద్ధి ప్రయాణంలో మేము ఒక అద్భుతమైన మైలురాయిని సాధించాము. మొదటిసారిగా మా ఆదాయం రూ.400 కోట్లకు వృద్ధి చెందింది. మా బ్రాండ్ విశ్వసనీయత మరియు అత్యాధునిక ఉత్పత్తి ఆఫరింగ్‌లు, అసమానమైన పంపిణీ నెట్‌వర్క్, అధునాతన సాంకేతికతతో కలిపి, మా విస్తరణను వేగవంతంగా కొనసాగించేందుకు మాకు వెసలుబాటు దక్కింది. మేము సాధించిన విశేషమైన విజయం చెల్లింపుల బ్యాంక్ మోడల్ ధృవీకరణగా, దేశంలోని డిజిటల్ మరియు ఆర్థిక చేరిక అవసరాలను తీర్చడంలో కీలక పాత్రగా ఉపయోగపడుతుందని వివరించారు.

ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ తన వ్యాపారాన్ని భౌగోళికంగా ఉన్న వినియోగదారులు, వ్యాపారాలకు సేవ చేసేందుకు మూడు విభాగాలుగా విస్తరించింది – అర్బన్ డిజిటల్ కన్స్యూమర్, రూరల్ అండర్ బ్యాంక్డ్ మరియు ఇండస్ట్రీస్ & బిజినెస్‌లు. బ్యాంక్ డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీస్‌ల బొకేతో పూర్తి ఎండ్-టు-ఎండ్ డిజిటల్ బ్యాంకింగ్ సొల్యూషన్‌ను అందిస్తుంది – బీమా, రుణాలు మరియు పెట్టుబడి పరిష్కారాలు. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఇప్పుడు తన ప్లాట్‌ఫారాలలో 7 బిలియన్లకు పైగా వార్షిక లావాదేవీలను ప్రాసెస్ చేస్తూ, వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ బ్యాంక్‌గా నిలిచింది. దీనికి 500,000 నైబర్‌హుడ్-బ్యాంకింగ్ పాయింట్‌ల అతిపెద్ద రిటైల్-బ్యాంకింగ్ నెట్‌వర్క్‌తో దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్‌ను తీసుకెళ్లడం ద్వారా బ్యాంక్ సేవలను అందుబాటులోకి తీసుకువెళ్లింది. నేడు, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ 3,000 కన్నా ఎక్కువ కార్పొరేట్ భాగస్వాములతో దేశంలో అతిపెద్ద మైక్రో క్యాష్ ప్లేయర్‌గా కూడా ఉంది. ఇక్కడ బ్యాంక్ తన పంపిణీ మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి లాస్ట్ –మైల్ నగదు డిజిటలైజేషన్ కోసం పరిష్కరించే అరుదైన ప్రదేశంలో ఉంది.