Last Updated:

Prabhas: మద్యానికి బానిసగా మారిన ప్రభాస్.. ?

Prabhas: మద్యానికి బానిసగా మారిన ప్రభాస్.. ?

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త సంచలనం సృష్టిస్తోంది. స్టార్ హీరోల గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. అందులో ప్రభాస్ గురించి అయితే నిత్యం ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. అందులో నిజముందా.. లేదా.. ? అనేది కూడా ఎవరికి అవసరం లేదు. ప్రభాస్ పేరు కనిపిస్తే చాలు వైరల్ చేసి పడేస్తారు.

 

ఇక ఇంకొంతమంది పేరు లేకుండా పాన్ ఇండియా స్టార్ అని చెప్పి ఆయన నటించిన సినిమా కలక్షన్స్ చెప్తూ ట్రోల్ చేయడం కొత్త ట్రెండ్ గా మార్చుకున్నారు. ఇక ఇప్పుడు ఒక పాన్ ఇండియా స్టార్ మద్యానికి బానిసగా మారాడని.. దానివలన సినిమా షూటింగ్స్ కు రావడం లేదని.. అందుకే ఆయన సినిమాలు రిలీజ్  లేట్ అవుతున్నాయని చెప్పుకురాగా.. కొంతమంది ట్రోలర్స్ అది ప్రభాస్ నే అని కన్ఫర్మ్ చేస్తున్నారు.

 

ఈశ్వర్ సినిమాతో కెరీర్ ను ప్రారంభించిన ప్రభాస్.. బాహుబలి సినిమాతో మొట్ట మొదటి పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఈ సినిమా తరువాత ప్రభాస్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని రాలేదు. వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఎక్కువ ఫ్యాన్ బేస్ ను పెంచుకున్నాడు. ఇక ఇండస్ట్రీలో వివాదాలు లేని హీరోగా.. ఎప్పుడు బయట పార్టీల్లో కనిపించని హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు.

 

ఇకపోతే స్టార్ హీరోలకు ఎంత మంచి పేరు ఉన్నా.. వారికంటూ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. మహేష్ బాబు ఒకప్పుడు సిగరెట్లు బాగా తాగుతాడని టాక్. ఆ తరువాత తనంతట తానే ఆ అలవాటును మానుకున్నాడట. అలానే ప్రభాస్ కు ఎక్కువగా డ్రింక్ చేస్తాడని టాలీవుడ్ లో టాక్. అయితే ఇప్పుడు ఆ మద్యం అలవాటు మరింత ఎక్కువగా అయ్యిందని అంటున్నారు.

 

ఈ అలవాటు వలనే డార్లింగ్ ముఖంలో మార్పులు వస్తున్నాయని, ఎక్కువ బయటకు రాకుండా చేస్తున్నాయని చెప్పుకొస్తున్నారు. ఆదిపురుష్ సమయంలో కారులో డార్లింగ్ ఫోటో ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెల్సిందే. అప్పుడు కూడా ప్రభాస్ ఎక్కువగా తాగడం వలనే అలా మారాడని  ట్రోల్ చేశారు. ఒకప్పుడు సినిమాలు ఉన్న సమయంలో తాగేవాడు కాదని, ఇప్పుడు సినిమాలు ఉన్నా కూడా తాగుతున్నాడని అంటున్నారు. దీనివలన నిర్మాతలు చాలా ఇబ్బందులను ఎదుర్కుంటున్నారట.

 

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. కల్కి 2, సలార్ 2, ది రాజాసాబ్, స్పిరిట్.  ఇలా ఒక్కో సినిమాకు సపరేట్ బ్యాన్ బేస్ ఉంది. ది రాజాసాబ్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. స్పిరిట్  ఆగస్టులో మొదలుకానుంది. ఇక కల్కి 2.. ఇంకా కథ రాయలేదు. సలార్ 2 ఎప్పుడు మొదలవుతుందో ప్రశాంత్ నీలే చెప్పాలి. ఇన్ని సినిమాలు పెట్టుకొని.. డార్లింగ్ ఇలాంటి పనిచేస్తాడా.. ? అనేది అనుమానంగా ఉంది. ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆ హీరో ప్రభాస్ కాకపోతే ఇంకెవరు అయ్యి ఉంటారు.. ? అని నెటిజన్లు ఆరాలు తీయడం మొదలుపెట్టారు.