Prabhas: బకాసురుడుగా ప్రభాస్.. ప్రశాంత్ వర్మ మాస్టర్ ప్లాన్.. ?

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే కల్కి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న డార్లింగ్.. తరువాత వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. డార్లింగ్ చేతిలో దాదాపు మూడు నాలుగు సినిమాల వరకు ఉన్నాయి. అందులో ది రాజా సాబ్ ఒకటి. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 10 న ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని మేకర్స్ తెలిపినా.. కొన్ని కారణాల వలన రాజాసాబ్ వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి.
ది రాజాసాబ్ కాకుండా ప్రభాస్ చేతిలో ఉన్న మరో బిగ్ ప్రాజెక్ట్ స్పిరిట్. అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ రూపురేఖలను మార్చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి.. బాలీవుడ్ కు వెళ్లి అక్కడ కబీర్ సింగ్, అనిమల్ సినిమాలతో టాలీవుడ్ సత్తా ఏంటో నిరూపించాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ ను పట్టాలెక్కించి పనిలో పడ్డాడు. ఈ సినిమాకు ఎప్పుడో అనౌన్స్ చేసినా.. ఇప్పటివరకు పట్టాలెక్కింది లేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రం ఆగస్టులో ప్రారంభం కానుందని టాక్.
ఇక ఈ రెండు సినిమాలు కాకుండా కల్కి, సలార్ సీక్వెల్స్ లైన్లో ఉన్నాయి. ఈ మధ్యనే ప్రభాస్ లిస్ట్ లో మరొక సినిమా యాడ్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. కుర్ర డైరెక్టర్ ప్రశాంత్ వర్మ యూనివర్స్ లోకి డార్లింగ్ కూడా చేరినట్లు టాక్ నడుస్తోంది. ప్రశాంత్ వర్మ సూపర్ హీరోస్ కాన్సెప్ట్ తో PVCUను మొదలుపెట్టాడు. ఇప్పటికే ఇందులో హనుమాన్ రిలీజ్ అవ్వగా.. జై హనుమాన్, మహాకాళీ షూటింగ్ జరుపుకుంటున్నాయి.
ఇక PVCU లో ప్రభాస్ కూడా భాగమయ్యాడు. అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ తో బకాసురుడు జీవిత కథను తెరకెక్కించే పనిలో ఉన్నాడట ప్రశాంత్ వర్మ. ఈ సినిమాకు భక అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. బకాసురుడు హిందూ పురాణాలలోని మహాభారతంలో ప్రస్తావించబడిన ఒక రాక్షసుడు. పాండవులు జూదంలో ఓడిపోయి..భిక్షాటన చేస్తూ ఏకచక్రపురం చేరుకుంటారు. అక్కడ కొంతమంది ప్రజలు వారికి ఆశ్రయమిస్తారు. అయితే బకాసురుడు అనే రాక్షసుడు వలన వారు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని.. తల్లి కుంతీ ఆజ్ఞతో భీముడు.. బకాసురుడుతో యుద్ధం చేసి అతనిని హతమారుస్తాడు.
ఇకే ఇదే కథతో ప్రశాంత్ వర్మ భక తెరకెక్కించనున్నాడట. టైటిల్ రోల్ లో ప్రభాస్ నటిస్తున్నాడట. నెగిటివ్ షేడ్స్ ఉండే ఈ పాత్రలో ప్రభాస్.. భీముడిగా మార్ స్టార్ హీరో నటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే ప్రశాంత్ వర్మ మాస్టర్ ప్లాన్ వేసినట్టే.. బకాసురుడుగా ప్రభాస్ చాలా చక్కగా సరిపోతాడు అని చెప్పొచ్చు. కానీ, నెగిటివ్ షేడ్స్ లో ప్రభాస్ ను ఫ్యాన్స్ ఒప్పుకుంటారా.. ? అనేది తెలియాల్సి ఉంది. మరి ఇందులో ఎంత నిజమున్నదో తెలియాల్సి ఉంది.