Published On:

Prabhas: జాట్ సెట్ లో మెరిసిన ప్రభాస్.. ఎన్నాళ్లయ్యింది డార్లింగ్ నీ లుక్ చూసి..

Prabhas: జాట్ సెట్ లో మెరిసిన ప్రభాస్.. ఎన్నాళ్లయ్యింది డార్లింగ్ నీ లుక్ చూసి..

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..  సినిమాలో తప్ప ఎప్పుడు బయట కనిపించడు.  డార్లింగ్ ఇంట్రోవర్ట్ కావడంతో ఆయన  సినిమా ఫంక్షన్స్ కు వచ్చినా ఎక్కువ మాట్లాడాడు. అప్పుడప్పుడు వేరే హీరోల ఫంక్షన్స్ లోనో.. లేదా తన సినిమా సెట్స్ లోనో దర్శనమిస్తూ ఉంటాడు. గత కొన్ని రోజులుగా డార్లింగ్ జాడనే కనిపించలేదు.

 

కొన్నిరోజుల క్రితం ప్రభాస్ మోకాలి సర్జరీ కోసం అమెరికా వెళ్లాడని వార్తలు వచ్చాయి. ఆ తరువాత రెస్ట్ మోడ్ లో ఉన్నాడని కొందరు.. ది రాజాసాబ్ షూట్ లో ఉన్నాడని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. అందులో ఏది నిజమో  అనేది ఇప్పటివరకు తెలియలేదు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.

 

ది రాజాసాబ్ ఫినిషింగ్ వర్క్ లో ఉండగా.. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా సెట్స్ మీద ఉంది.  అన్ని బావుండి ఉంటే.. ఈ పాటికీ డార్లింగ్ ది రాజాసాబ్ ప్రమోషన్స్ కోసం తిరుగుతూ రోజు కనిపించేవాడు. కానీ,  ఆ సినిమా వాయిదా పడడంతో మళ్లీ కెమెరా కంటికి కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు జాట్ సినిమా పుణ్యమా అని ఫ్యాన్స్ కు డార్లింగ్ దర్శనమయ్యింది. తాజాగా ప్రభాస్.. జాట్ సినిమా సెట్ లో సందడి చేశాడు.

 

సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న జాట్ సినిమాకు తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్ కు ప్రభాస్ వెళ్లి సందడి చేశాడు.  ఇందుకు సంబంధించిన ఫోటోలను మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు యాక్షన్ హీరోలు అంటూ మైత్రీ క్యాప్షన్ పెట్టుకొచ్చింది.

 

ఇక ప్రభాస్ లుక్ మాత్రం నెక్స్ట్ లెవల్ లో ఉంది. బ్లాక్ కలర్ టీ షర్ట్, బ్లాక్ గాగుల్స్ తో చాలా స్టైలిష్ గా కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. డార్లింగ్ లుక్ చూసి ఎన్నాళ్లయ్యింది డార్లింగ్  నిన్ను ఇలా చూసి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.