Published On:

Prabhas: పాకిస్థాన్ నటితో ప్రభాస్ రొమాన్స్.. దేశ ద్రోహం అంటూ నెటిజన్స్ ఫైర్

Prabhas: పాకిస్థాన్ నటితో ప్రభాస్ రొమాన్స్.. దేశ ద్రోహం అంటూ నెటిజన్స్ ఫైర్

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు పహల్గాం సెగ అంటుకుంది. జమ్మూకాశ్మీర్ లో పహల్గాంలో జరిగిన దాడి గురించి అందరికీ తెల్సిందే. దేశ అందాలను చూడడానికి వచ్చిన 28 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కిరాతకంగా చంపేశారు. హిందువులు అని కన్ఫర్మ్ చేసుకున్నాకే వారిని కాల్చి చంపారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. ఈ దాడిని ఇండియన్స్ మొత్తం ఖండిస్తున్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  ఇక ఈ సమయంలోనే ప్రజల వ్యతిరేకత ప్రభాస్ సినిమా వైపు తిరిగింది.

 

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ఫౌజీ ఒకటి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి నటిస్తోంది. ఇప్పుడు ఇమాన్వి గురించే ఈ వివాదం మొదలయ్యింది. ఇమాన్వి బ్యాక్ గ్రౌండ్ సెర్చ్ చేసి.. ఆమె ఒక పాకిస్థాన్ మాజీ మిలటరీ ఆఫీసర్ కుమార్తె అని కనుగున్నారు. అంటే ఆమె కూడా ఒక పాకిస్థానీ. అలాంటి ఒక అమ్మాయిని తెలుగు సినిమాలో తీసుకోవడం దేశానికి ద్రోహం చేయడమే  అని, ఆమెను వెంటనే సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

 

ఇక ఇమాన్వి కుటుంబం గురించి చెప్పాలంటే..  ఇమాన్వి అసలు పేరు ఇమాన్ ఇస్మాయిల్.  ఆమె తండ్రి పాకిస్థాన్ మిలటరీ ఆఫీసర్ అయినప్పటికీ.. ఇమాన్వి చిన్నతనంలోనే వారు ఢిల్లీకి వలస వచ్చారు. ఇమాన్వి చిన్నతనం నుంచి ఇక్కడే చదువుకుంది. ఇక్కడే జాబ్ చేస్తుంది. స్వతహాగా డ్యాన్సర్ అయినా ఇమాన్వి .. ఇన్స్టాగ్రామ్ లో చేసిన ఒక రీల్ బాగా వైరల్ కావడంతో.. ఆ రీల్ ను చుసిన హను, ఈ అమ్మాయి అయితే కరెక్ట్ గా సరిపోతుందని ఫౌజీ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. ఇక ఫౌజీ పూజా కార్యక్రమాలు పూర్తి అవగానే ఓవర్ నైట్ లోనే ఇమాన్వి ఫేమస్ అయ్యింది.

 

అన్ని బావుంటే ఆమె గురించి అసలు ప్రస్తావన వచ్చేదే కాదు. కానీ, ఈ ఉగ్రదాడి వలన గుండె ముక్కలు అయిన భారతీయులు పాకిస్థాన్ అంటేనే మండిపడుతున్నారు. అందులో ఇమాన్వి తండ్రి  పాకిస్థాన్ మిలటరీ ఆఫీసర్ అని తెలియడంతో వారి కోపం కట్టలు తెచ్చుకుంది. ప్రభాస్ ఇది గమనించి.. ఇమాన్విని కనుక సినిమాలో నుంచి తొలగించకపోతే డార్లింగ్ కు కూడా విమర్శలు తప్పేలా లేవని అర్ధమవుతుంది. అయితే ఇంకొంతమంది మాత్రం అందరూ ముస్లిమ్స్ ఒకేలా ఉండరు. వారు ఎప్పుడో  ఇండియాకు వచ్చేసారు.. వారిని ఇలాంటి వివాదాల్లోకి లాగొద్దు అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ వివాదంపై మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి.