Published On:

The Rajasaab Update: ఇంకా ఓపిక అంటే కష్టం గురూ.. ఏదోకటి తేల్చండి..!

The Rajasaab Update: ఇంకా ఓపిక అంటే కష్టం గురూ.. ఏదోకటి తేల్చండి..!

Prabhas Upcoming Movei “The Rajasaab” Update: తమ అభిమాన హీరో సినిమా కోసం ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పన ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్.. డార్లింగ్ సినిమా కోసం ఎన్నేళ్ళైన ఎదురుచూస్తారు. బాహుబలి దగ్గరనుంచి వీరికి ఆ ఎదురుచూపులు అలవాటుగా మారాయి. ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజ్ చేస్తానని ప్రభాస్ మాట ఇచ్చిన విషయం తెల్సిందే.

 

డార్లింగ్ చెప్పినట్లే .. ఏడాదికి ఎన్ని సినిమాలు సెట్ మీద ఉన్నా కూడా కనీసంలో కనీసం రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తాను అని చెప్పుకొచ్చాడు. డార్లింగ్ చివరి సినిమా కల్కి 2898AD. గతేడాది జూన్ లో రిలీజ్ అయ్యింది. ఇక గతేడాది చివర్లో మరో సినిమా ది రాజాసాబ్ రిలీజ్ కు రెడీ అవుతుందని వార్తలు వచ్చాయి.

 

డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ తో పాటు మరో ఇద్దరు ముద్దుగుమ్మలు సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి 2025, ఏప్రిల్  10 న రిలీజ్ అవుతుందని చెప్పుకొస్తూనే ఉన్నారు. సినిమా మొదలై రెండేళ్లు అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ మేకర్స్ ఇచ్చింది లేదు.

 

ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ 10 న ఈ సినిమా రిలీజ్ కాదు అని అందరికీ క్లారిటీ వచ్చేసింది. అయితే అసలు ఎందుకు రాజాసాబ్ లేట్ అవుతుంది.. కారణం ఏంటి.. ? అనేది ఇప్పటివరకు మేకర్స్ అధికారికంగా తెలిపింది లేదు. దీంతో ఫ్యాన్స్ ఓపిక నశించి.. రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వాలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

 

తాజాగా రాజాసాబ్ రిలీజ్ పై డైరెక్టర్ మారుతీ నోరు విప్పాడు. సీజీ వర్క్ తో పాటు కొంత టాకీ వర్క్ పూర్తి చేయాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. ” పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆ పని మీదనే ఉంది. వారే మీకు సమాచారం ఇస్తారు. ప్రస్తుతం సీజీ వర్క్ నడుస్తుంది. అది పూర్తైన వెంటనే.. మేకర్స్ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారు. ఈ ప్రక్రియలో చాలా  విషయాలు పొందుపరిచి ఉంటాయి. ఇది ఒక వ్యక్తి మాట లేదా పని కాదు కాబట్టి కొన్ని విషయాల్లో సమయం పడుతుంది. ఓపికగా ఉండండి, ప్రతి ఒక్కరూ మీ అంచనాలకు తగ్గట్టుగా తమ వంతు కృషి చేస్తున్నారు. 

 

కొంచెం టాకీ పార్ట్, కొన్ని సాంగ్స్ మిగిలి ఉన్నాయి. మా కోసం చాలా సీజీ స్టూడియోలు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు కొన్ని స్టూడియోల నుండి వచ్చిన అవుట్‌పుట్ ఉత్సాహంగా ఉంది. ఇతర స్టూడియోల నుండి కూడా అదే ఆశిస్తున్నాము. పాటల షూటింగ్ పూర్తయితే సింగిల్స్ కూడా రిలీజ్ చేస్తాం. అవి కూడా మిమ్మల్ని అలరిస్తాయి. మా కష్టాన్ని మీకు చూపించడానికి నేను కూడా వేచి ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే  ఫ్యాన్స్ మాత్రం ఇంకా ఓపిక ఏంటి గురు.. త్వరగా ఏదో ఒకటి తేల్చండి. ఎన్నేళ్లు అని మేము కూడా ఎదురుచూడాలి అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాతో ప్రభాస్… ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.