Upcoming Releases : ఈ వారం ఓటీటీ/ థియేటర్లో రిలీజ్ కానున్న సినిమా/ వెబ్ సిరీస్ లు..
సమ్మర్ వార్ కి సినిమాలు అన్నీ బరిలోకి దిగుతున్నాయి. ఈ తరుణంలో ఏప్రిల్ చివరి వారంలో కూడా పోటీకి సై అంటూ పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు థియేటర్‌లో, ఓటీటీ లో సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. మరి ఆ చిత్రాలేంటో మీకోసం ప్రత్యేకంగా..
Upcoming Releases : సమ్మర్ వార్ కి సినిమాలు అన్నీ బరిలోకి దిగుతున్నాయి. ఈ తరుణంలో ఏప్రిల్ చివరి వారంలో కూడా పోటీకి సై అంటూ పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు థియేటర్‌లో, ఓటీటీ లో సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. మరి ఆ చిత్రాలేంటో మీకోసం ప్రత్యేకంగా..
ఈ వారం థియేటర్ లో రిలీజ్ అయ్యే సినిమాలు Upcoming Releases ..
ఏజెంట్..
సురేందర రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం “ఏజెంట్”. ఈ సినిమాలో అఖిల్ స్పైగా నటించనున్నాడు. ఈ స్పై థ్రిల్లర్‌లో మమ్ముట్టీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య ఈ మూవీలో అఖిల్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తుండగా, ఇప్పటివరకూ లవర్‌బాయ్‌గా మెప్పించిన అఖిల్ ఈసారి యాక్షన్‌తో అదరగొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా ఏప్రిల్ 28న థియేటర్‌లలో విడుదల కానుంది.
పొన్నియిన్ సెల్వన్..
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్’ ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా ‘పొన్నియిన్ సెల్వన్2’ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ, శోభితా ధూళిపాళ్ళ కీలక పాత్రలు పోషించారు. పీఎస్ 1 లో మిగిలిపోయిన ప్రశ్నలన్నింటికీ ఈ సేకవేల సమాధానంగా రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.
రా రా పెనిమిటి..
నందితా శ్వేత కథానాయికగా సింగిల్ క్యారెక్టర్‌తో నడిచే కథతో రూపొందిన చిత్రమే ‘రా రా పెనిమిటి’. సత్య వెంకట గెద్దాడ దర్శకత్వంలో ప్రమీల నిర్మించిన ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందించారు. ఈ మూవీ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కొత్తగా పెళ్లైన అమ్మాయి తన భర్త రాకకోసం ఎదురు చూస్తూ పడే విరహ వేదనే ఈ చిత్రం. ఆమె భర్త వచ్చాడా?లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే’. ఈ చిత్రంలో తెరపై కనిపించేది ఒక్క పాత్రే అయినా.. వినిపించే పాత్రలకు బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సునీల్, సప్తగిరి, హేమ, అన్నపూర్ణమ్మ వాయిస్ అందించడం విశేషం అని చెప్పాలి.
శిసు..
జల్మరీ హెలెండర్ దర్శకత్వంలో తెరకెక్కిన హిస్టారికల్ యాక్షన్ మూవీ ‘శిసు’. జొర్మా తొమ్మిలా, అక్సెల్ హెన్ని, జాన్ డూలన్ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 28న ఈ సినిమా ఇంగ్లీష్‌తో పాటు, హిందీలోనూ విడుదల కానుంది.
Upcoming Releases ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు..
నెట్‌ఫ్లిక్స్..
దసరా (మూవీ) ఏప్రిల్ 27..
నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేశ్ తో కలిసి నటించిన చిత్రం “దసరా”. ఇటీవలే విడుదలైన చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. సింగరేణి నేపథ్యంలో తెరకిక్కిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో నాని, కీర్తి సురేశ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీక్షిత్‌శెట్టి, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషించారు. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. నాని కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీ లో ఏప్రిల్ 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
కోర్ట్ లేడీ (హిందీ వెబ్‌సిరీస్) ఏప్రిల్ 26
నోవోల్యాండ్(వెబ్‌సిరీస్) ఏప్రిల్ 26
ది గుడ్ బ్యాడ్ మదర్ (వెబ్‌సిరీస్) ఏప్రిల్ 27
ఎకా (హాలీవుడ్) ఏప్రిల్ 28
బిఫోర్ లైఫ్ ఆఫ్టర్‌డెత్ (హాలీవుడ్) ఏప్రిల్ 28
అమెజాన్ ప్రైమ్..
సిటాడెల్ (వెబ్ సిరీస్ ) ఏప్రిల్ 28 ..
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ‘సిటాడెల్’ తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యింది. . రిచర్డ్ మ్యాడన్ లీడ్ రోల్ చేసిన ఈ సిరీస్ లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేసింది. జోన్స్, స్టాన్లీ టక్కీ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 28న అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా తొలి రెండు ఎపిసోడ్‌లను స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారు. ఆ తర్వాత మే నెలలో ప్రతి వారం ఒక్కో ఎపిసోడ్ విడుదల కానుంది. దాదాపు 300 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో ఈసిరీస్‌ను తెరకెక్కించారు. రూసో బ్రదర్స్, అమెజాన్ స్టూడియోస్. డేవిడ్ వెయిల్ దీనికి దర్శకత్వం వహించారు. దీనికి ఇండియన్ వెర్షన్‌లో వరుణ్ ధావన్, సమంత నటించనున్నారు.
పత్తు తల (తమిళ చిత్రం) ఏప్రిల్ 27
జీ5..
‘వ్యవస్థ’ (మూవీ ) ఏప్రిల్ 28
‘కేరాఫ్ కంచరపాలెం’, ‘నారప్ప’ తదితర సినిమాలతో గుర్తింపు పొందిన కార్తిక్ రత్నం, హెబ్బా పటేల్, సంపత్‌రాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ “వ్యవస్థ”. న్యాయ వ్యవస్థ నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్‌కు ఆనంద్ రంగ దర్శకత్వం వహించారు. ‘జీ 5’ ఓటీటీ వేదికగా ఏప్రిల్ 28 నుంచి ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది.
యూటర్న్ (హిందీ) ఏప్రిల్ 28
బుక్ మై షో..
స్క్రీమ్ 6 (హాలీవుడ్) ఏప్రిల్ 26
సోనీలివ్..
తురముఖమ్ (మలయాళ చిత్రం) ఏప్రిల్ 28
డిస్నీ+హాట్‌స్టార్..
సేవ్ ది టైగర్స్ (తెలుగు సిరీస్) ఏప్రిల్ 27
పీటర్ పాన్ అండ్ వెండీ (హాలీవుడ్) ఏప్రిల్ 28