Published On:

Nenu-Keerthana OTT: ఓటీటీలో అదరగొడుతున్న ‘నేను-కీర్తన’ – స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

Nenu-Keerthana OTT: ఓటీటీలో అదరగొడుతున్న ‘నేను-కీర్తన’ – స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

Nenu Keerthana Movie Now Streaming Amazon Prime: చిమటా రమేష్ బాబు (సీహెచ్‌ఆర్‌) స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న చిత్రం ‘నేను-కీర్తన’. చిమటా ప్రొడక్షన్స్‌లో చిమటా జ్యోతిర్మయి సమర్పణలో చిమటా లక్ష్మీ కుమారి నిర్మించిన ఈ సినిమా గతేడాది ఆగష్టు 30న థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు ఈ చిత్రంలో ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్‌ 16న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైంలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

 

అయితే రెంటల్‌ పద్దతిలో దీనిని స్ట్రీమింగ్‌కి ఇచ్చారు. రూ. 99కే ఈ చిత్రాన్ని అందుబాటులో ఉంచారు. ఇప్పుడీ సినిమాకు ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్‌ వస్తుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ వ్యూస్‌ రాబట్టుకుంది. లవ్‌, సెంటిమెంట్‌, యాక్షన్‌, రొమాన్స్‌, కామెడీ, హార్రర్‌తో పాటు అన్ని ఎలిమెంట్స్‌తో మల్టీజానర్‌ మూవీగా చిమటా రమేష్‌ బాబు ఈ చిత్రాన్ని రూపొందించారు.

 

ఈ సినిమా కథేంటంటే

విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలో రమేష్‌ బాబు జానీ పాత్రలో నటించారు. అన్యాయాలను ఎదురించే యువకుడిగా జానీ పాత్రలో రమేష్‌ బాబు నటనకు విమర్శకుల ప్రశంసలు వస్తున్నాయి. అయితే ఓ విషయంలో జానీ విలన్స్‌తో పోరాడాల్సి వస్తుంది. అదే టైంలో జానీ లైఫ్‌లోకి కీర్తన వస్తుంది. ఇద్దరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారుతుంది. కీర్తన ప్రమాదంలో ఉందన్న విషయం తెలిసిన జానీ.. ఆమెను ఈ ప్రమాదం నుంచి ఎలా బయటకు తీసుకువచ్చానేది ‘నేను-కీర్తన’ కథ.

 

ఈ క్రమంలో వారికి ఎదురయ్యే పరిణామాలు, ఈ జర్నీలో వారి స్నేహం ప్రేమగా ఎలా మారింది? అనేది సినిమా చూసి తెలుకోవాల్సిందే. కులమనాలిలో చిత్రీకరించిన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ హైలెట్‌గా ఉన్నాయి. ఊహించని మలుపులతో కథను హర్రర్‌ వైపు తీసుకువెళ్లిన తీరు ఆకట్టుకుంది. రిషిత, మెఘటన హీరోయిన్లుగా నటించగా.. రేణు ప్రియా, సంధ్య. జీవా, విజయ్ రంగరాజ్‌, జబర్దస్త్‌ అప్పారావు, సన్నీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఐఎమ్‌డీలో 8.9 రేటింగ్‌, బుక్‌మై షోలో 9.3 రేటింగ్‌ను సొంతం చేసుకుంది ఈ సినిమా.