Last Updated:

వీసాల గడువు ముగిసినా భారత్ ను వదలని 40 వేలమంది విదేశీయులు

కోవిడ్ -19 మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా పలువురు విదేశీయులు భారత్ కు వచ్చారు.అయితే వీసాల గడువు ముగిసినప్పటికీ 40,000 మందికి పైగా విదేశీయులు భారతదేశంలోనే ఉన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2019లో వీసాల గడువు ముగిసిన తర్వాత దేశంలో నివసిస్తున్న విదేశీయుల సంఖ్య 54,576

వీసాల గడువు ముగిసినా భారత్ ను వదలని 40 వేలమంది విదేశీయులు

New Delhi: కోవిడ్ -19 మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా పలువురు విదేశీయులు భారత్ కు వచ్చారు. అయితే వీసాల గడువు ముగిసినప్పటికీ 40,000 మందికి పైగా విదేశీయులు భారతదేశంలోనే ఉన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, 2019లో వీసాల గడువు ముగిసిన తర్వాత దేశంలో నివసిస్తున్న విదేశీయుల సంఖ్య 54,576 కాగా, 2020లో 40,239 మంది ఉన్నారు. వీసా తేదీకి మించి భారత్‌లో ఉంటే జరిమానా, ఐదేళ్ల వరకు జైలు శిక్ష, మళ్లీ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధం కూడా విధించవచ్చని అధికారులు తెలిపారు. వీసా పరిమితి ముగిసినప్పటికీ దేశంలో 16 రోజుల నుండి 30 రోజుల వరకు ఉంటే రూ. 10,000, 31 రోజుల నుండి 90 రోజుల వరకు ఉంటే రూ. 20,000 మరియు 90 రోజులు దాటితే రూ. 50,000 వరకు జరిమానా విధించబడుతుంది.

ఏప్రిల్ 1, 2020 మరియు డిసెంబర్ 31, 2020 మధ్య మొత్తం 32,79,315 మంది విదేశీ పౌరులు భారతదేశాన్ని సందర్శించారు.హోం మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఈ కాలంలో భారత్‌ను సందర్శించిన అత్యధిక సంఖ్యలో విదేశీయులు యునైటెడ్ స్టేట్స్ (61,190) తర్వాత బంగ్లాదేశ్ (37,774), యునైటెడ్ కింగ్‌డమ్ (33,323), కెనడా (13,707), పోర్చుగల్ (11,668) మరియు ఆఫ్ఘనిస్తాన్ నుంచి (11,212)మంది విదేశీయులు భారత్ ను సందర్శించారు. 8,438 మంది జర్మన్ పౌరులు, 8,353 మంది ఫ్రెంచ్ పౌరులు, ఇరాక్ నుండి 7,163 మంది మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా నుండి 6,129 మంది కూడా ఈ కాలంలో భారతదేశాన్ని సందర్శించారు. అంతేకాకుండా, 2020లో 4,751 మంది పాకిస్తానీ పౌరులు భారత్‌ను సందర్శించారు. ఏప్రిల్ 1, 2020 మరియు డిసెంబర్ 31, 2020 మధ్య కాలంలో భారత్ కు వచ్చిన వారిలో పైన చెప్పిన దేశాలకు చెందిన వారు 71 శాతానికి పైగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి: