Last Updated:

PM Narendra Modi: నేడు యుద్దం ప్రధానం కాదు

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మరి ఆహారం, ఎరువుల కొరత, ఇంధన భద్రత సమస్యల పరిష్కారం ముఖ్యమని, నేటి యుగం యుద్ధ యుగం కాదని ప్రధాని మోదీ రష్యా అద్యక్షుడు పుతిన్ తో అన్నారు. ఉబెకిస్తాన్ లోని సమర్కండ్ లో జరిగిన షాంగై సహకార సంస్ధ శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొన్నారు

PM Narendra Modi: నేడు యుద్దం ప్రధానం కాదు

Uzbekisthan: పుతిన్ తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో వారివురి మద్య విలువైన సంభాషణలు చోటు చేసుకొన్నాయి. ప్రధానంగా రష్యా, ఉక్రెయిన్ మద్య జరుగుతున్న యుద్దం నేపధ్యంలో పై వ్యాఖ్యలను మోదీ అన్నారు. యుద్దం వాతావరణం పై నేను మీతో పలు పర్యాయాలు మాట్లాడిన్నట్లు పుతిన్ కు గుర్తు చేశారు. మనం శాంతి మార్గంలో ఎలా పురోగమించగలమో అన్న విషయాల పై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. భారత్, రష్యా దేశాలు అనేక దశాబ్దాలుగా స్నేహపూర్వక పరస్పారం కల్గివున్నట్లు ఉండడం చర్చలో వచ్చింది.

ఈ మద్య కాలంలో అనూహ్యంగా ఉక్రెయిన్ దేశం నుండి రష్యా సేనలు వెనక్కి వెళ్లిపోతున్నాయన్న వాదనలు నడుమ ప్రధాని మోదీ పుతిన్ తో మాట్లాడిన మాటలు మరింత కీలకమైనాయి.

ఇవి కూడా చదవండి: