Published On:

Karachi: పాకిస్తాన్ జైలు నుంచి ఖైదీలు పరార్.. కరాచీలో హైఅలర్ట్

Karachi: పాకిస్తాన్ జైలు నుంచి ఖైదీలు పరార్.. కరాచీలో హైఅలర్ట్

Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం దాయాది పాకిస్తాన్ కు ఎన్నో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ జరిపిన దాడులకు పాకిస్తాన్ కు తీవ్రంగా నష్టం కలిగింది. ఉగ్రవాద స్థావరాలతో పాటు ఆదేశ ఆర్మీ క్యాంపులపై కూడా భారత్ దాడులు చేసింది. అలాగే పాకిస్తాన్ ప్రయోగించిన ఎన్నో మిస్సైళ్లు, డ్రోన్లు, యుద్ధ రాకెట్లను ధీటుగా కూల్చివేసింది. దీంతో పాకిస్తాన్ కు తీవ్ర నష్టం కలిగింది. తాము ఉగ్రవాదానికి వ్యతిరేకమని ప్రపంచం ముందు పాకిస్తాన్ చేస్తున్న ఎన్నో ప్రయత్నాలు విఫలమవుతున్నాయి.

 

ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కు మరో ఇబ్బంది ఎదురైంది. కరుడు గట్టిన నేరస్తులు ఉండే కరాచీలోని మాలిర్ జైలు నుంచి ఖైదీలు తప్పించుకున్నారు. నిన్న అర్ధరాత్రి జరిగిన హింసాత్మక ఘటన తర్వాత ఖైదీలు పోలీసులతో ఘర్షణ పడినట్టు సమాచారం. దీంతో కరాచీ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖైదీలు జైలు ప్రవేశద్వారాన్ని బద్దలుకొట్టి పెద్ద సంఖ్యలో పారిపోయారు. జైలులో పెద్ద ఎత్తున కాల్పులు జరిగినట్టు సమాచారం. కాగా ప్రజలు జైలు పరిసరాల్లో ఉండొద్దని పాకిస్తాన్ అధికారులు ఆదేశాలిచ్చారు.

 

దాదాపు 200 మంది వరకు ఖైదీలు తప్పించుకున్నట్టు తెలుస్తోంది. వీరిలో 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖైదీల దాడిలో గాయపడిన ఒక పోలీస్ పరిస్థితి విషమంగా ఉందని వర్గాలు తెలిపాయి. భద్రతా కారణాల దృష్ట్యా జైలుకు ఆనుకుని ఉన్న జాతీయ రహదారిని రెండు వైపులా తాత్కాలికంగా మూసివేశారు. జైలు మొత్తాన్ని సీల్ చేశామని, కొంతమంది ఖైదీలు, పోలీసులు గాయపడినట్టు జైలు డీఐజీ హసన్ సెహ్టో తెలిపారు. పరిస్థితిని పాక్ రేంజర్లు, పోలీసులు, ఎఫ్సి సిబ్బంది ప్రయత్నిస్తోంది.