Published On:

Heavy Rains: హిమాచల్ ప్రదేశ్ లో వర్ష బీభత్సం

Heavy Rains: హిమాచల్ ప్రదేశ్ లో వర్ష బీభత్సం

Red Alert To Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆకస్మిక వరదలు తోడయ్యాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రధాన నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇక మండి జిల్లాలో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. కాంగ్రా, మండి, హమీర్ పూర్, సిమ్లా, సిర్మౌర్, సోలన్ జిల్లాల్లో రేపటి వరకు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

 

మంగళవారం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలతో వరదలు సంభవించాయి. దీంతో 14 బ్రిడ్జిలు, 148 ఇళ్లు కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు 51 మంది ప్రాణాలు కోల్పోగా, 34 మంది గల్లంతయ్యారు. కొండచరియలు విరిగి పడటంతో 460 రహదారులను అధికారులు మూసివేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

మరోవైపు ఉత్తరాఖండ్ లోనూ వర్షాలు భారీగా పడుతున్నాయి. దీంతో కేదార్ నాథ్ యాత్రను ఇవాళ తాత్కాలికంగా నిలిపివేశారు. సోన్ ప్రయాగ్ మార్గంలో మున్ కతియా వద్ద కొండచరియలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు కేదార్ నాథ్ యాత్రను బంద్ చేశారు. గౌరీకుండ్ నుంచి వస్తున్న కొందరు యాత్రికులు బండరాళ్ల కింద చిక్కుకుపోగా.. వారిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు.

ఇవి కూడా చదవండి: