Published On:

Jaffar Express Bomb Explosion: పాక్‌లో రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు.. ప్రమాదానికి గురైన జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌!

Jaffar Express Bomb Explosion: పాక్‌లో రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు.. ప్రమాదానికి గురైన జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌!

Jaffar Express Bomb Explosion in Pakistan: పాక్‌లో జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. సింధ్‌ ప్రావిన్స్‌‌లోని జకోబాబాద్‌ వద్ద రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు సంభవించింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. రైలు మార్గంలో ఐఈడీ బాంబు అమర్చడం వల్ల పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళ్తున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులోని ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని స్థానిక మీడియా తెలిపింది.

 

జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌పై దాడి జరగడం ఈ సంవత్సరం ఇది రెండోసారి. ఈ సంవత్సరం మార్చిలో జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను పాకిస్థాన్‌లోని వేర్పాటువాద బలోచ్‌ మిలిటెంట్లు హైజాక్‌ చేశారు. అందులోని వందలాది మందిని బందీలుగా చేసుకున్నారు. ఈ క్రమంలో వారిని రక్షించేందుకు వెళ్లిన పాకిస్థాన్ సైనికులను హతమార్చారు. అనంతరం పాకిస్థాన్ ఆర్మీ ఆపరేషన్‌ చేపట్టి బందీలను విడిచిపెట్టింది. 214 మంది పాకిస్థాన్ సైనికులను హతమార్చినట్లు బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ అప్పట్లో ప్రకటించింది.

 

ఇవి కూడా చదవండి: