Israel – Iran War: మాపై అణుదాడిచేస్తే పాకిస్తాన్ బదులిస్తుంది: ఇరాన్
Israel – Iran War: ఇరాన్ పై ఇజ్రాయిల్ అణ్వయుధాన్ని ప్రయోగిస్తే పాకిస్తాన్ బదులు తీర్చుకుంటుందని ఇరాన్ కు చెందిన జనరల్ మోహ్సెన్ రెజాయ్ అన్నారు. ఆయన మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వూలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు రెండు దేశాలలో దాదాపు 248మంది చనిపోయారన్నారు. ఇరాన్ కు చెందిన 230, ఇజ్రాయిల్ 18మంది అసువులు బాశారన్నారు.
“ఇజ్రాయెల్ ఇరాన్‌పై అణు బాంబును ప్రయోగిస్తే, పాకిస్తాన్ ఇజ్రాయెల్‌పై అణు బాంబుతో దాడి చేస్తారని మాకు హామీ ఇచ్చింది” అని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సీనియర్ అధికారి మరియు ఇరాన్ జాతీయ భద్రతా మండలి సభ్యుడు రెజాయ్ అన్నారు. పాకిస్తాన్ మాత్రం ఈ వాదనను అంగీకరించలేదు.
ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్ (ICAN ) ప్రకారం, ప్రస్తుతం అణ్వాయుధాలను కలిగి ఉన్న తొమ్మిది దేశాలలో ఇజ్రాయెల్ , పాకిస్తాన్ ఉన్నాయి.
ఇరాన్ మాత్రం పాకిస్తాన్ తో సహా ముస్లిం దేశాలన్నీ ఏకం కావాలని కోరింది. తుర్కియో, సౌదీ, పాకిస్తాన్ లాంటి ముస్లిం దేశాలు కలిసి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటుచేసుకుంటే తిరుగులేదని అన్నారు మొహసిన్.