Published On:

Super Offer: ఆకర్షిస్తున్న రూ.150కే 3BHK ప్రమోషన్స్

Super Offer: ఆకర్షిస్తున్న రూ.150కే 3BHK ప్రమోషన్స్

Movie Promotions: దక్షిణాదిలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకొన్న నటుడు సిద్ధార్థ్, కన్నడ హీరోయిన్ చైత్ర జే ఆచార్ జంటగా నటిస్తున్న సినిమా 3 BHK. ఈ సినిమాకు శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తున్నారు. జులై 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శరత్‌కుమార్, మీఠా రఘునాథ్, యోగిబాబు, చైత్ర కీలకపాత్రలో నటిస్తున్నారు. అరుణ్ విశ్వ నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానుంది. ఈ సందర్బంగా చిత్రబృందం వరుస ప్రమోషన్స్‌ని నిర్వహిస్తుంది. ఇప్పటికే ట్రైలర్ విడుదల చేయగా.. మంచి వ్యూస్ రాబడుతోంది.

 

అయితే 3BHK కొనాలంటే రూ.75 లక్షలు అవసరం లేదు. కేవలం రూ.150 చాలంటూ చిత్రయూనిట్ వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఇందులో ఒక మధ్యతరగతి కుటుంబం సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం కోసం పడే బాధలను, వారి కలలను ఆవిష్కరించే భావోద్వేగ భరితమైన కుటుంబ డ్రామాగా రాబోతుంది.

ఇవి కూడా చదవండి: