Suicide Bombing: ఆత్మాహుతి దాడిలో పాకిస్తాన్ సైనికుల మృతి

Pakistan Soldiers Killed: పాకిస్తాన్ లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది సైనికులు చనిపోయారు. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ ఏఎఫ్పీ వెల్లడించింది. ఫాకిస్తాన్ లోని పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు సమీపంలో ఘటన జరిగినట్టు కథనాలు వెలువడ్డాయి.
బాంబులతో నిండి ఉన్న ఓ వాహనం సైనిక కాన్వాయ్ పైకి దూసుకొచ్చింది. అనంతరం జరిగిన పేలుడులో 13 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. అలాగే బాంబు దాడిలో మరో 10 మంది సైనికులు, 19 మంది పౌరులు గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని ఉత్తర వజీరిస్థాన్ జిల్లా ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. కాగా దాడికి సంబంధించి ఇప్పటి వరకూ ఏ గ్రూప్ బాధ్యత వహించలేదు. కాగా ఇటీవలే ఈ ప్రాంతంలో తెహ్రిక్- ఇ- తాలిబన్.. పాకిస్తాన్ సైనికులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది.