Published On:

Pakistan: పాకిస్తాన్‌పై మండిపడుతోంది ఇరాన్‌

Pakistan: పాకిస్తాన్‌పై మండిపడుతోంది ఇరాన్‌

Iran angry on pakistan due to israel war: మన పొరుగున ఉన్న పాకిస్తాన్‌ గురించి ఇండియానే కాదు.. ప్రస్తుతం ఇరాన్‌ కూడా తీవ్ర ఆగ్రహంతో రగలిపోతోంది. ఇజ్రాయెల్‌ – ఇరాన్‌ యుద్ధంలో ఇరానియన్‌ కమాండర్‌ మహ్మద్‌ బాఖేరి లోకేషన్‌ను ఇజ్రాయెల్‌కు షేర్‌ చేసి ఆయన ప్రాణాలు తీసినందుకు పాకిస్తాన్‌పై మండిపడుతోంది ఇరాన్‌. పాకిస్తాన్‌ అణు పితామహుడిగా గొప్పగా చెప్పుకుంటున్న డాక్టర్‌ ఎ క్యూ ఖాన్‌ ఇరాన్‌కు బ్లాక్‌ మార్కెట్లో అణ్వాయుధాల పార్మూలాను విక్రయించాడు.

 

ఇరాన్‌కు అణ్వాయుధాలను తయారు చేయడానికి కావాల్సిన డిజైన్‌, బ్లూప్రింట్స్‌, విడిభాగాలతో పాటు ఇతర పరికరాలను డాక్టర్‌ ఖాన్‌ విక్రయించాడు. 1980 నుంచి 1990 మధ్య ఆయన రహస్యంగా దుబాయి, మలేషియా ద్వారా ఒక మధ్యవర్తి బీఎస్‌ఏ తాహిర్‌ అనే వ్యక్తి ద్వారా అణ్వాయుధాలు తయారు చేయడానికి కావాల్సిన ఫార్మూలాను పంపించాడని తాజాగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. డాక్టర్‌ ఎకె ఖాన్‌ ఏ ఏ దేశాలకు అణ్వాయుధాల ఫార్మూలాను విక్రయించి సొమ్ము చేసుకుంది.

 

పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌.. కొత్తగా ఫీల్డ్‌ మార్షల్‌ హోదా దక్కించుకున్న అసిమ్‌ మునీర్‌ కేవలం రెండు నెలల క్రితమే బలోచిస్తాన్‌ మిలిటెంట్లను ఉద్దేశించి గట్టి వార్నింగ్‌ ఇచ్చాడు. పాక్‌ మిలిటరీ జోలికి వస్తే మీ అంతు చూస్తామని హెచ్చరించారు. పిడికెడు మంది లేని మీరు పాకిస్తాన్‌ సైన్యాన్ని ఎదుర్కొంటారా అని ఎద్దేవా చేశాడు. మరోసారి మా జోలికి వస్తే మీ తాట తీస్తా.. భూమిలో పాతేస్తానంటూ ఇస్లామాబాద్‌లో జరగిన ఒక సదస్సులో మాట్లాడుతూ వార్నింగ్‌ ఇచ్చాడు. బలోచిస్తాన్‌ పాకిస్తాన్‌లో అంతర్భగామేనని గట్టిగా వాదించాడు.

 

తీరా చూస్తే గత శనివారం నాడు పాకిస్తాన్‌కు చెందిన తెహరిక్‌ ఎ తాలిబన్‌ పాకిస్తాన్‌ కు చెందిన మిలిటెంట్ గ్రూపు ఆత్మాహుతి దాడికి పాల్పడి 16 మంది సైనికులను చంపేసింది. మరి మునీర్‌ హెచ్చరికలను టీటీపీ కానీ.. బీఎల్‌ఏ కానీ లైట్‌గా తీసుకుంది.

ఇవి కూడా చదవండి: