CM Chandrababu: ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు.. కుప్పంలో సీఎం చంద్రబాబు

CM Chandrababu visits kuppam: సీఎం చంద్రబాబు ఆరోగ్య ఆంధ్రలో భాగంగా రెండో రోజు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన కుప్పం ప్రాంతీయ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సెంటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం, టాటా సంస్ సహకారంతో ఏర్పాటు చేసింది. ఈ సెంటర్‌కు 13 పీహెచ్‌సీలతో పాటు 92 విలేజ్ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రి అటాచ్ చేశారు. ఒకేచోట డిజి నెర్వ్ జరిగేలా చర్యలు తీసుకోనుంది. దీనికి కేంద్రం సేవలు అందిస్తుండగా.. వర్చ్ వల్ విధానంలో వైద్యులు అందుబాటులో ఉండేలా వెసులుబాటు కల్పించనుంది.
అనంతరం మామిడి రైతులపై సీఎం చంద్రబాబు రివ్యూ నిర్వహించారు. దిగుబడి పెరిగిందని, డిమాండ్ తగ్గిపోయిందని, అందుకే రేటు కూడా తగ్గిపోయిందన్నారు. రైతులకు ఏం చేయాలో చేస్తామని, అవసరమైతే కేంద్రం సాయం తీసుకుంటామని చెప్పారు. ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం రైతులకు ఏమైనా చేసిందా? కనీసం డ్రిప్ సామాగ్రి కూడా ఇవ్వలేదన్నారు.
వైసీపీ హయాంలో కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేదన్నారు. వాటాలు వసూలు చేసిన వాళ్లు రైతుల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మా ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు అన్నారు. అలాగే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం ప్రతిదీ రాజకీయమే.. ఇప్పుడు రాజకీయాలేమీ లేవని వెల్లడించారు. అనర్హులకు పెన్షన్ తీసేస్తే దానిని కూడా రాజకీయం చేస్తున్నారన్నారు.
కారు కింద కార్యకర్త పడిన మానవత్వం చూపించలేదని విమర్శలు చేశారు. కుక్కపిల్ల మాదిరిగా సింగయ్యను పక్కన పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగయ్య కుటుంబసభ్యులను బెదిరించి రాజకీయం చేస్తున్నారన్నారు. నీతిమాలిన వాళ్లు, రౌడీలు రాజకీయాల్లో ఉన్నారన్నారు. ఒక్క చిల్లి గవ్వ కూడా ఖర్చు చేయని వాళ్లు మాట్లాడుతున్నారని చంద్రబాబు వైసీపీ ఫైర్ అయ్యారు. దోచుకోవడమే తప్పా ఇవ్వడం తెలియని వాళ్లతో రాజకీయం చేయాల్సి వస్తోందన్నారు. పీ4 పథకంలో పేదలను ఆదుకోవడానికి వచ్చిన వారిపైనా విమర్శలా? అన్నారు. పేదలను మీరు ఆదుకోకపోగా ముందుకు వచ్చిన వారిపై విమర్శలు చేస్తారా? అని ప్రశ్నించారు.