Ramayana: రామాయణ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసిందోచ్!

Ramayana Introduction Video: బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణబీర్ కపూర్, న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ రామాయణ. దంగల్ మూవీ డైరెక్టర్ నితేశ్ తివారీ డైరెక్షన్ లో మూవీ తెరకెక్కుతుండగా.. నమిత్ మల్హోత్రా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూవీలో రణబీర్ కపూర్ రాముడిగా ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. సాయిపల్లవి సీత పాత్ర పోషిస్తోంది. కన్నడ స్టార్ యాక్టర్ యష్ ఈ మూవీలో రావణుడి క్యారెక్టర్ చేస్తున్నాడు. రెండు భాగాలుగా ఈమూవీ రూపొందుతోంది. ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది దీపావళికి విడుదల అవనుండగా.. 2027 దీపావళి నాటికి రెండో పార్ట్ విడుదల కానుందని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతోంది.
అందులో భాగంగానే రామాయణ మూవీ నుంచి మేకర్స్ తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. తాజాగా విడుదలైన వీడియోలో వీఎఫ్ఎక్స్, బీజీఎమ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
కాలం ఉనికిలో ఉన్నప్పటి నుంచి త్రిమూర్తులు ముల్లోకాలను పాలిస్తున్నారు. “బ్రహ్మ.. సృష్టికర్త, విష్ణువు.. సృష్టి పాలకుడు, శివుడు.. సృష్టి లయకారుడు. కానీ వారి సృష్టి మూడు లోకాలపై ఎదురుతిరిగినప్పుడు అన్ని యుద్ధాలను అంతం చేసే యుద్ధం ప్రారంభమైంది. 5000 సంవత్సరాల నుంచి 2500 కోట్ల మంది ప్రజలచే ఆరాధించబడుతోంది. ఇది ఒక అమరమైన ఇతిహాస గాథ. రాముడు- రావణుడు, రావణుడు- శక్తి, ప్రతీకారం, రాముడు- ధర్మం, త్యాగం. రణబీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా, సాయి పల్లవి సీతగా, రవి దుబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా, సంగీతం హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్. రచయిత శ్రీధర్ రాఘవన్, డైరెక్టర్ నితేశ్ తివారీ.” అంటూ వీడియోతో ప్రాతలపై క్లారిటీ ఇచ్చారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఆద్యంతం అంచనాలు పెంచేసింది.