BollyWood: విషాదంలో బాలీవుడ్.. ప్రముఖ నటుడు కన్నుమూత
Vibhu Raghave: స్టార్ టీవీ యాక్టర్ విభు రాఘవ్ కన్నుమూశారు. మూడేళ్లుగా ఆయన స్టేజ్- 4 కోలన్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. తాజాగా ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కాగా ‘నిషా అండ్ హర్ కజిన్స్’, ‘సావధాన్ ఇండియా’, ‘సువ్రీన్ గుగ్గల్- టాపర్ ఆఫ్ ది ఇయర్’ వంటి టీవీ షోలలో నటించి పేరు తెచ్చుకున్న విభు, 2022లో క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయింది.
ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకుని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని వారిలో ధైర్యం నింపారు. చికిత్స కోసం సింపుల్ కౌల్, అదితీ మాలిక్, మోహిత్ మాలిక్ వంటి నటులు కెట్టో ఆర్గనైజేషన్ ద్వారా నిధులు సేకరించారు. కాగా విభు రాఘవ్ మరణంతో బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. పలు నటీనటులు, అతని సన్నిహితులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.