Last Updated:

Indonesia:ఇండోనేషియా చమురు డిపోలో అగ్నిప్రమాదం.. 17 మంది దుర్మరణం

ఇండోనేషియాలో శుక్రవారం నాడు చమురు డిపోలో మంటలంటుకొని సుమారు 17 మంది దుర్మరణం పాలయ్యారు. వందలాది మంది గాయపడ్డారు. డిపోకు చుట్టుపక్కల నివాసం ఉంటున్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు

Indonesia:ఇండోనేషియా చమురు డిపోలో అగ్నిప్రమాదం.. 17 మంది దుర్మరణం

Indonesia:ఇండోనేషియాలో శుక్రవారం నాడు చమురు డిపోలో మంటలంటుకొని సుమారు 17 మంది దుర్మరణం పాలయ్యారు. వందలాది మంది గాయపడ్డారు. డిపోకు చుట్టుపక్కల నివాసం ఉంటున్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలు ఆర్పడానికి 52 ఫైర్‌ ఇంజిన్లు, 260 ఫైర్‌ ఫైటర్స్‌ కాలంతో పోటీ పడి మంటలను ఆర్పడానికి పోరాడుతున్నారని అధికారులు తెలిపారు. ప్రభుత్వరంగానికి చెందిన ఈ చమురు సహజ వాయువు కంపెనీ పెర్టామినా ఉత్తర జకార్తాలో తన్హా మెరా ప్రాంతంలో ఉంది. కాగా ఈ డిపోకు చుట్టుపక్కల అత్యధిక జనాభాతో కిటకిట లాడుతోంది. దీంతో పాటు ఈ డిపో దేశీయ అవసరాల్లో 25 శాతం తీరుస్తోంది.

పైప్ లైన్ రాపిడికి గురై మంటలు..(Indonesia)

కాగా చమురు డిపోకు మంటలు అంటుకోగానే దేశంలోని అన్ని టెలివిజన్‌ చానల్స్‌ ఎద్ద ఎత్తున కవరేజీ ఇచ్చాయి. ఒక వైపు దట్టమై పొగ మరో వైపు మంటలు ఎగిసిపడుతున్నాయి. కాగా ఫైర్‌ ఫైటర్స్‌ మంటలను అదుపులోకి తేవడానికి తీవ్రంగా పోరాడుతున్నారు. ప్రాథమిక విచారణలో తేలింది ఏమిటంటే కార్మికులు మెరుపు సమ్మెకు దిగడంతో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పైప్‌లైన్‌ రాపిడికి గురై మంటలంటుకొనే అవకాశం ఉందని కంపెనీ ఏరియా మేనేజర్‌ తెలిపారు. అయితే ఈ డిపోకు మంటలంటుకున్నందు వల్ల సరఫరాపై పెద్ద ప్రభావం ఉండదని చెప్పారు.

600 మంది తరలింపు..

జాకార్తా గవర్నర్‌ హెరు బుడి హర్టానో డిపోలో మంటల గురించి ప్రస్తావిస్తూ సుమారు 600 మందిని ప్రభుత్వ కార్యాలయాల్లోకి, స్పోర్ట్‌ స్టేడియంలో తాత్కాలక బస ఏర్పాటు చేశామని చెప్పారు.. ప్రమాదం గురించి జాకార్తా ఫైర్‌ డిపార్టుమెంట్‌ చీఫ్‌ మాట్లాడుతూ డిపోలో మంటలంటుకోవడంతో సుమారు 17 మంది మృతి చెందారని.. వారిలో ఇద్దరు పిల్లలు.. 50 మంది కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేర్పించామని చెప్పారు. కాగా డిపోలో మంటలంటుకోవడం వెంటనే పలు చోట్ల భారీ పేలుళ్లు సంభవించి అటు తర్వాత మంటలు కాస్తా చుట్టు పక్కల ఉన్న ఇళ్లకు పాకాయన్నారు.

ఇదిలా ఉండగా ఇండోనేషియా ప్రభుత్వంలో సహాయ మంత్రి ఎరిక్‌ తోహిర్‌ మృతి చెందినవారి కుటుంబసభ్యులకు తీవ్ర సంతాపం తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. కాగా శుక్రవారం నాడు జరిగిన అగ్ని ప్రమాదం ఇక్కడ ఇదే మొదటిసారి కాదు. గతంలో 2014లో కూడా మంటలంటుకొని 40 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. అయితే అప్పుడు జరిగిన అగ్ని ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. అయితే ఎనర్జీ ఎనలిస్టులు మాత్రం వెంటనే పెర్టామినా డిపోను ప్రభుత్వం వెంటనే నివాస ప్రాంతాలనుంచి తరలించాలని డిమాండ్‌ చేశారు.