Allu Arjun: తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు – గద్దర్ అవార్డులపై స్పందించిన అల్లు అర్జున్

Allu Arjun Thanks to Telangana Government: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ గద్దర్ సినిమా అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. సినీరంగాన్ని ప్రోత్సాహించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది పురస్కారాల స్థానంలో గద్ధర్ అవార్డులను తీసుకోవచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ క్రమంలో గద్ధర్ తొలి అవార్డులను నేడు ప్రకటించారు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ (పుష్ప 2 సినిమాకు), ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్ (కల్కి సినిమా) ఉత్తమ చలన చిత్రంగా కల్కి 2898 ఏడీతో పాటు మరిన్ని సినిమాలు, నటీనటులకు ఈ అవార్డులను ప్రకటించింది ప్రభుత్వం.
గద్ధర్ తొలి అవార్డుల్లో తనకు ఈ గౌరవం కల్పించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హీరో అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఘనత తన డైరెక్టర్ సుకుమార్‌తో పాటు పుష్ప 2 టీం మొత్తానిదన్నారు. ఈ మేరకు బన్నీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ అవార్డును తన అభిమానులకు అంకితం ఇస్తున్నట్టు పేర్కొన్నారు. “తొలిసారి ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని ప్రకటించడం నిజంగా నాకు దక్కి న గౌరవం ఇది. ఇందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ఈ ఘనత మొత్తం నా డైరెక్టర్ సుకుమార్, మా నిర్మాతలకు అలాగే మొత్తం పుష్ప టీంకి దక్కుతుంది. ఈ అవార్డును నా అభిమానులకు అంకితం చేస్తున్నారు. సినీరంగానికి మీరు అందిస్తున్న ప్రోత్సాహకం నాలో స్ఫూర్తినింపుతుంది” అంటూ అల్లు అర్జున్ తన ట్వీట్ పేర్కొన్నారు. మరోవైపు ఈ గద్దర్ అవార్డుల పురస్కారాలపై టాలీవుడ్ ప్రముఖులంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా గద్దర్ అవార్డులపై స్పందించారు. సినిమా వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది నంచి అవార్డులు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. దేవర చిత్రానికి గాను ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డు గెలుచుకున్న గణేష్‌తో పాటు విజేతలందరికి శుభాంక్షలు తెలియజేశారు.
I am truly honoured to receive the first Best Actor award for #Pushpa2 at the #GaddarTelanganaFilmAwards 2024.
Heartfelt thanks to the Government of Telangana for this prestigious honour .
All credit goes to my director Sukumar garu, my producers, and the entire Pushpa team.
I…
— Allu Arjun (@alluarjun) May 29, 2025