Last Updated:

Visas: భారతీయ నిపుణులకు ప్రతీఏటా 3,000 వీసాలు.. రిషి సునక్ నిర్ణయం

యునైటెడ్ కింగ్‌డమ్‌ ప్రధానమంత్రి, రిషి సునక్ ప్రతి సంవత్సరం బ్రిటన్‌లో పని చేయడానికి భారతదేశానికి చెందిన యువ నిపుణుల కోసం కనీసం 3,000 వీసాలకు అనుమతినిచ్చారు. .

Visas: భారతీయ నిపుణులకు ప్రతీఏటా 3,000 వీసాలు.. రిషి సునక్ నిర్ణయం

Visas: యునైటెడ్ కింగ్‌డమ్‌ ప్రధానమంత్రి, రిషి సునక్ ప్రతి సంవత్సరం బ్రిటన్‌లో పని చేయడానికి భారతదేశానికి చెందిన యువ నిపుణుల కోసం కనీసం 3,000 వీసాలకు అనుమతినిచ్చారు. .ఇండోనేషియా రాజధాని బాలిలో 17వ G20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో సునక్ సమావేశమైన కొన్ని గంటల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. అక్టోబర్‌లో సునక్ యూకే ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇద్దరు నేతల మధ్య జరిగిన మొదటి సమావేశం ఇది.

18-30 ఏళ్ల డిగ్రీ-విద్యావంతులైన భారతీయ పౌరులు రెండు సంవత్సరాల వరకు జీవించడానికి మరియు పని చేయడానికి యూకే కి రావడానికి 3,000 వీసాలను అందిస్తున్నారు” అని యూకే ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో తెలిపింది. ఈ పథకం యూకే మరియు భారతదేశం మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో అలాగే ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలను పెంపొందించడానికి దోహదం చేస్తుంది.

యూకేలోని మొత్తం విదేశీ విద్యార్థులలో నాలుగింట ఒక వంతుకు పైగా భారత విద్యార్దులే ఉన్నారు. మరోవైపు భారతదేశం మరియు యూకేల మధ్య వాణిజ్య ఒప్పందంపై కూడ చర్చలు జరుగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందం ఆమోదం పొందినట్లయితే, ఇది బ్రిటన్ తో భారతదేశం చేసుకున్న మొట్టమొదటిది ఒప్పదం అవుతుంది.

ఇవి కూడా చదవండి: