Pawan Kalyan Wishes to Telangana: నాకు పునర్జన్మ ఇచ్చిన నేల తెలంగాణ.. పవన్‌కల్యాణ్ ఎమోషనల్ విషెస్!
AP Deputy CM Pawan Kalyan Wishes to Telangana Formation Day: జనసేనకు జన్మనిచ్చిన నేల.. నాకు పునర్జన్మనిచ్చిన నేల తెలంగాణ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా, యువత బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పవన్ కల్యాణ్ అన్నారు.
నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల తెలంగాణ అని పవన్ కల్యాణ్ అన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచర్య కీర్తించిన నేల నా తెలంగాణ అని పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణ 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.