Home / united kingdom
బ్రిటన్‌లో ఇమ్మిగ్రేషన్ పాలసీలో మార్పులు చోటు చేసుకోవడంతో ఐటి నిపుణుల కంటే చెఫ్‌ల నుంచి దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఏడాది బ్రిటన్ డిపెండెంట్స్ వీసాలను నిలిపివేసింది.
ఎర్ర సముద్రం చుట్టు పక్కల హౌతీ రెబెల్స్ దారుణాలకు అంతే లేకుండా పోయింది. ఆ మార్గం గుండా ప్రయాణించే సరకు రవాణా నౌకలను హైజాక్ చేసి తీసుకెళ్లిన ఘటనలు కొకొల్లలు. ఇండియాకు చెందిన నౌకలను కూడా హైజాక్ చేసిన విషయం తెలిసిందే.
యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ సోమవారం తన హోం మంత్రి సుయెల్లా బ్రేవర్‌మన్‌ను తొలగించారు. సునక్ ఈరోజు తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నారు.మాజీ విదేశాంగ కార్యదర్శి జేమ్స్ క్లీవర్లీ యూకే కొత్త హోం మంత్రిగా ,మాజీ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ కొత్త విదేశాంగ కార్యదర్శిగా నియమితులయ్యారు అంటూ 10 డౌనింగ్ స్ట్రీట్ X లో ఒక పోస్ట్‌లో తెలిపారు.
యూకేలో జాత్యహంకారానికి అర్దంపట్టే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. నర్సులు సిక్కు రోగి యొక్క గడ్డాన్ని ప్లాస్టిక్ గ్లోవ్స్‌తో కట్టి, అతని మూత్రంలో అతడినివదిలి, మతపరమైన కారణాల వల్ల తినలేని ఆహారాన్ని అతనికి అందించినట్లు తెలిసింది. ఆ వ్యక్తి తన మరణశయ్యపై ఉన్న నోట్‌లో వివక్ష గురించి ఫిర్యాదు చేసినప్పటికీ, ఆ నర్సులను కొనసాగించారు.
యునైటెడ్ కింగ్‌డమ్ భద్రతా మంత్రి, టామ్ తుగెన్‌ధాట్ ఖలిస్థాన్ అనుకూల తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి 95,000 పౌండ్ల (సుమారు రూ. 1 కోటి) కొత్త నిధులను ప్రకటించారు. బ్రిటిష్ హైకమిషన్ గురువారం ప్రారంభమైన తుగెన్‌ధాట్ మూడు రోజుల భారత పర్యటన సందర్బంగా ఈ విషయాన్ని తెలిపింది.
యూకే లో మెడిసిన్ చదువుదామనుకునే వారికి ముఖ్యంగా వచ్చే ఏడాది అడ్మిషన్లు కోరుకునే వారు వెంటనే అప్లై చేసి ప్రవేశ పరీక్షకు సిద్దమవ్వాలి. ఈ పరీక్షను UCAT అంటారు. అంటే యూకే క్లినికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ .. యూకేలోని 35 కాలేజీల్లో ఎంబీబీఎస్ చదువాలనుకునే విద్యార్దులు 2024 విద్యా సంవత్సరానికి ఈ ఏడాది జూన్ 20న నోటిఫికేషన్ జారీ అయింది.
జాగ్వార్ ల్యాండ్ రోవర్(JLR) లను తయారు చేసే టాటా గ్రూప్ యూకే లో తన కొత్త ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ ప్లాంట్ కోసం సన్నాహాలు ప్రారంభించింది. ఇది రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ మరియు జాగ్వార్ బ్రాండ్‌లతో సహా JLR యొక్క భవిష్యత్తు బ్యాటరీ ఎలక్ట్రిక్ మోడళ్లను సరఫరా చేస్తుంది. ఈ ఫ్యాక్టరీలో 4 బిలియన్ పౌండ్ల (5.2 బిలియన్ డాలర్లు) పెట్టుబడి ఉందని కంపెనీ తెలిపింది.
మద్యం మత్తులో స్పృహతప్పిన మహిళపై అత్యాచారం చేసినందుకు ఒక భారతీయ విద్యార్థిని యూకేలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ప్రీత్ వికల్ (20) అనే వ్యక్తి గత ఏడాది జూన్‌లో మద్యం మత్తులో ఉన్న మహిళను కార్డిఫ్‌లోని తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని వారు తెలిపారు.
యూకే ప్రభుత్వం మంగళవారం భారతీయులతో సహా విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని కొత్త ఇమ్మిగ్రేషన్ విధానాన్ని ప్రకటించింది. హౌస్ ఆఫ్ కామన్స్‌కి వ్రాతపూర్వక ప్రకటనలో యూకే హోమ్ సెక్రటరీ సుయెల్లా బ్రేవర్‌మాన్ మాట్లాడుతూ, ప్రస్తుతం పరిశోధన ప్రోగ్రామ్‌లుగా నియమించబడిన పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులలోని అంతర్జాతీయ విద్యార్థులు మాత్రమే పిల్లలు మరియు వృద్ధ తల్లిదండ్రులతో సహా వారి కుటుంబ సభ్యులను వారిపై ఆధారపడిన వారిగా తీసుకురావడానికి అనుమతించబడతారని తెలిపారు.
వివాదాస్పద కోహినూర్ వజ్రంతో సహా బ్రిటీష్ మ్యూజియంలలోని మరియు రాజకుటుంబం వద్ద ఉన్న వస్తువులను స్వదేశానికి తరలించడానికి భారతదేశం ఈ ఏడాది చివర్లో ప్రచారాన్ని ప్రారంభించాలని యోచిస్తోందని ది డైలీ టెలిగ్రాఫ్ ఒక నివేదికలో పేర్కొంది.