Published On:

Vikram Sugumaran Died: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ సుకుమారన్ కన్నుమూత!

Vikram Sugumaran Died: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ సుకుమారన్ కన్నుమూత!

Kollywood Director Vikram Sugumaran Passes away: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కోలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ సుకుమారన్ గుండెపోటుతో మరణించారు. మధురైలో ఓ నిర్మాతకు కొత్త చిత్రానికి సంబంధించి కథ చెప్పిన అనంతరం ఇంటికి వస్తుండగా రాత్రి బస్సులో అకస్మాత్తుగా ఛాతీలో నొప్పిరావడంతో అక్కడే కుప్పకూలారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశారు.

 

విక్రమ్ సుకుమారన్.. 2013లో ‘మధయనై కూట్టం’ సినిమాతో తమిళ సినిమాలో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత వెట్రిమారన్‌తో కలిసి హీరో ధనుష్ నటించిన ‘ఆడుకాలం‘ మూవీకి మాటలు రాశారు. చాలా గ్యాప్ తర్వాత ‘రావణకోట్టం’ సినిమాకు దర్శకత్వం వహించాడు. అంతేకాకుండా పలు చిత్రాల్లో నటించారు. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన పొల్లాధవన్ మూవీలో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. శశికుమార్ నటిమచిన ‘కొడివీరన్’ మూవీలో నటించారు.

 

ఇక, 1999 నుంచి 2000 వరకు దర్శకుడు బాలు మహేంద్ర, విక్రమ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఆయన మృతిపై సినీ పరిశ్రమ సంతాపం ప్రకటించింది. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. వీరు చెన్నైలోని రెడ్ హిల్స్ కాలనీలో ఉంటున్నారు. ఆయన మృతదేహాన్ని మధురై నుంచి చెన్నైకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.

 

అయితే, విక్రమ్ సుకుమారన్ తన కల నెరవేరకుండానే చనిపోయినట్లు శాంతును ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. తర్వాత సూరితో ఓ సినిమా చేయాలనేది అతను ప్లాన్ చేసినట్లు చెప్పారు. శంతునుతో మధయానై కొట్టం, రావణ కొట్టం సినిమాలు తీసి అందరి మన్ననలు పొందారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అని శంతును ట్వీట్ చేశారు.