Home / Rishi Sunak
యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ భార్య, అక్షతా మూర్తి, తన తండ్రి నిర్మించిన సంస్థ ఇన్ఫోసిస్ లిమిటెడ్ యొక్క షేర్లు పతనమైన తర్వాత సోమవారం సుమారు రూ. 500 కోట్లను కోల్పోయారు. ఇన్ఫోసిస్ షేర్లు 9.4 శాతం పడిపోయాయి.
బ్రిటన్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. దేశంలోని ప్రతి రంగానికి చెందిన ఉద్యోగులు రోడ్డెక్కి వేతనాలు పెంచండి మహా ప్రభో అంటూ సమ్మె చేస్తున్నారు.
బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఈసారి తన కుక్క కారణంగా పోలీసులతో మరోసారి చిక్కుల్లో పడ్డారు. కారు సీటు బెల్ట్ ధరించనందుకు మరియు మహమ్మారి లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు సునక్ గతంలో రెండుసార్లు జరిమానా ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషి సునాక్ విజయవంతంగా వంద రోజులు పూర్తి చేసుకున్నారు.గడ్డు పరిస్థితుల్లో వంద రోజులు పూర్తి చేసుకోవడం చాలా గొప్పే అని చెప్పవచ్చు.
బ్రిటన్ ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్‌కు సొంత పార్టీ సభ్యుల నుంచే అసమ్మతి సెగ మొదలయింది.
భారతీయులు ఎక్కడున్నా తమ మూలాలను మరిచిపోరు అంటుంటారు. దానికి ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తున్నారు యూకే ప్రధాని రిషీ సునాక్. ఎందుకంటే తన కుమార్తెకు భారతీయ సాంస్కృతీ సంప్రదాయాలకు చెందిన నృత్య రూపాల్లో ఒకటైన కూచిపూడిని రిషీ సునాక్ కూతురు అనౌష్క సునాక్ అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించారు.
బ్రిటన్‌లో రిషి సునాక్ ప్రభుత్వం మొట్టమొదటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి ఆదాయపు పన్ను పెంచడంతో పాటు ప్రభుత్వ వ్యయాన్ని భారీగా కోత విధించింది.
యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి, రిషి సునక్ ప్రతి సంవత్సరం బ్రిటన్‌లో పని చేయడానికి భారతదేశానికి చెందిన యువ నిపుణుల కోసం కనీసం 3,000 వీసాలకు అనుమతినిచ్చారు. .
ఇటీవల బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన భారత సంతతికి చెందిన నేత రిషి సునాక్ మంగళవారం తొలిసారిగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇండోనేషియా రాజధాని బాలి వేదికగా జరుగుతున్న జీ20 సదస్సుకు ఆయా సభ్య దేశాల అధినేతలు హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఒకరికొకరు ఎదురుపడి ఇద్దరు నేతలు పలకరించుకున్నారు.
బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. సునాక్ శుక్రవారం సౌత్ లండన్‌లోని క్రొయిడన్ యూనివర్సిటీ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ ఓ మహిళా రోగిని పరామర్శిస్తూ ఆసుపత్రి సిబ్బంది ఎలా చూసుకుంటున్నారని ప్రశ్నించారు.