Nepal: నేపాల్ లో కొండచరియలు విరిగిపడి 17మంది మృతి
నేపాల్ లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడడంతో ఇప్పటి వరకు 17మంది మృతిచెందారు. ఈ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి.

Nepal: నేపాల్ లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడడంతో ఇప్పటి వరకు 17మంది మృతిచెందారు. ఈ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి.సుదుర్ పశ్చిమ్ ప్రావిన్స్‌లోని అచ్చం జిల్లాలో కొండచరియలు విరిగిపడగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనలో మరో 11 మంది గాయపడ్డారని, మరో ముగ్గురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.
గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం సుర్ఖేత్ జిల్లాకు విమానంలో తరలించారు. ప్రస్తుతం గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు తెలిపారు.