Brain Healthy Food: బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తీసుకుంటే మంచిది !
మీ శరీరానికి పోషకాహారం ఎలా అవసరమో, మీ మెదడును కూడా ఆరోగ్యంగా ఉండేలా.. చూసకునేందుకు పోషకాహారం అవసరం. ఇందుకోసం మనం తీసుకోవాలే కానీ మంచి ఆహారాలు చాలానే ఉన్నాయి. వీటిని రోజూ మీరు తినే ఫుడ్స్ లో చేర్చుకుంటే సరిపోతుంది.
Brain Healthy Food: మీ శరీరానికి పోషకాహారం ఎలా అవసరమో, మీ మెదడును కూడా ఆరోగ్యంగా ఉండేలా.. చూసకునేందుకు పోషకాహారం అవసరం. ఇందుకోసం మనం తీసుకోవాలే కానీ మంచి ఆహారాలు చాలానే ఉన్నాయి. వీటిని రోజూ మీరు తినే ఫుడ్స్ లో చేర్చుకుంటే సరిపోతుంది. ఉదాహారణకి నెయ్యి, ఆలివ్ ఆయిల్, వాల్ నట్, నానబెట్టిన బాదం, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు, తాజా పండ్లు. మీ మెదడు ఆరోగ్యంగా ఉంచాలంటే పప్పులు, బీన్స్, పనీర్ చాలా ముఖ్యం. ఆయుర్వేదం ప్రకారం జీలకర్ర మన మెదడుని బాగా పనిచేసేలా చేస్తుందని.. అంతే కాకుండా నల్ల మిరియాలు ఎక్కువుగా తీసుకుంటే మనసు మంచిగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు వెల్లడించారు.
మన మెదడు బాగా పనిచేయాలంటే మనకి ఆక్సిజన్ చాలా అవసరం. ఐనప్పటికి ఆక్సిజన్ వినియోగం, లిపిడ్ రిచ్ కంటెంట్‌తో మన మెదడు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఇది శరీర కణాలలో ఫ్రీ రాడికల్స్ అధికంగా చేరడానికి దారి తీస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్‌ని బ్యాలెన్స్ చేయానికి, మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచడానికి బాగా పనిచేస్తాయి. ఎరుపు రంగు పండ్లు, కూరగాయలు, పుచ్చకాయ, టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.
మీ శరీరం దాని పనులను సరిగ్గా నిర్వహించడానికి తగినంత నీరు తీసుకొనప్పుడు, మీరు బలహీనంగా అవుతారు. అలాంటి సమయంలో ఓ హెర్బల్ టీ తాగడం వల్ల మన మెదడు హైడ్రేట్ అవుతుందని, మానసిక శక్తి, జ్ఞాపకశక్తిని కూడా ఈ టీ పెంచుతుందని నిపుణులు ఓ పరిశోధనలో వెల్లడించారు.హెర్బల్ టీ లో ఉండే పదార్థాలలో ఇంగువ, పసుపు, వాము, తులసిలు ఉంటాయి. వాటన్నింటిని తీసుకొని ఒక కప్పు నీటిలో పోసి కాసేపు మరిగించి తాగాలి.