Tollywood: సినీ పరిశ్రమ కీలక నిర్ణయం.. సమస్యలపై ప్రత్యేక కమిటీ
Tollywood Telugu Film Chamber Special Committee: తెలుగు సినీ పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో కలిపి మొత్తం 30 మంది సభ్యులుగా ఉన్నారు. ఇక, ఈ కమిటీకి చైర్మన్‌గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ ఉండగా.. కన్వీనర్‌గా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ వ్యవహరించనున్నారు. ఇందులో సభ్యులుగా ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి 10 మంది ఉండగా.. డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి మరో 10 మంది, చివరగా ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి సైతం 10 మంది ఉన్నారు.