Published On:

Ileana: మరోసారి తల్లైన టాలీవుడ్ హీరోయిన్

Ileana: మరోసారి తల్లైన టాలీవుడ్ హీరోయిన్

Ileana Shares Her Child Photo: ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్. తన అందం, అభినయంతో ఫస్ట్ మూవీతోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ఇలియానా. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలో అనేక హిట్ మూవీస్ లో నటించింది. ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, రవితేజ, విజయ్ దళపతి వంటి స్టార్ హీరోలతో నటించి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది ఈ అమ్మడు. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. కొన్ని రోజులకు అవకాశాలు తగ్గడంతో నెమ్మదిగా ఇండస్ట్రీకి దూరమైంది. దీంతో తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుని వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. 2023లో మొదటిసారి బాబుకు జన్మనిచ్చిన ఆమె.. తాజాగా మరోసారి బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇలియానా తన ఇన్ స్టా అకౌంట్ లో ఈ విషయాన్ని పంచుకుంది.

సినిమాల అనంతరం ఇలియానా తన లవర్ మైఖేల్ డోలన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరిద్దరికీ 2023లో ఓ బాబు జన్మించాడు. ఫస్ట్ బేబికీ ఫీనిక్స్ డోలన్ అనే పేరు పెట్టారు. ఈనెల 19న ఈ ఇద్దరికీ మరో బాబు పుట్టాడు. తాజాగా వారి రెండో బాబు ఫోటోలను ఇలియానా అభిమానులతో పంచుకుంది. బాబుకు కీయాను రేఫ్ డోలన్ అనే పేరు పెట్టినట్టు వెల్లడించింది. కొద్దిరోజుల క్రితమే తాను రెండోసారి ప్రెగ్నెంట్ అయినట్టుగా ఫోటో షేర్ చేసిన ఇలియానా.. తాజాగా తన రెండో బాబు ఫోటోలను పంచుకుంది. ఇలియానా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమెకు పలువురు అభిమానులు, నటీనటులు శుభాకాంక్షలు చెప్తున్నారు.

 

 

Capture

 

 

 

ఇవి కూడా చదవండి: