Published On:

Ustaad Bhagat Singh: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్..‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సెట్స్‌లో మెగాస్టార్ చిరంజీవి

Ustaad Bhagat Singh: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్..‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సెట్స్‌లో మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi visited Ustaad Bhagat Singh Shooting in hyderabad: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కిస్తుండగా.. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

 

అయితే పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో గబ్బర్ సింగ్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా, మేకర్స్ కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తుండగా.. ఈ షూటింగ్‌లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

 

హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుండగా.. చిరంజీవి ఎంట్రీ ఇచ్చి షూటింగ్ పనులను పర్యవేక్షించారు. చిరంజీవి షూటింగ్ ను దగ్గరుండి చూస్తుండగా.. పక్కనే పవన్ కల్యాణ్ ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయంపై అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మెగా బ్రదర్స్ మరోసారి కలిసి మల్టీస్టారర్ సినిమా తీస్తే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు.

 

ఇదిలా ఉండగా, ఈ మూవీలో శ్రీలీల నటిస్తుండగా.. సాక్షి వైద్య, అశుతోష్ రానా, నాగ మహేష్, గౌతమి, టెంపర్ వంశీ, అవినాష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి: