Published On:

Producer Sirish: అభిమానులకు శిరీష్ క్షమాపణలు

Producer Sirish: అభిమానులకు శిరీష్ క్షమాపణలు

Sirish Say Sorry To Fans: నితిన్ నటించిన తమ్ముడు మూవీ ప్రొడ్యూసర్ శిరీష్.. అభిమానులకు సారీ చెప్పారు. జులై 4న విడుదల మూవీ విడుదల కానున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్ లో దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్.. రామ్ చరణ్ ని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశారు. గేమ్ ఛేంజర్ ఫలితం తర్వాత రామ్ చరణ్ కనీసం ఫోన్ కూడా చేయలేదని చెప్పిన కామెంట్స్ పై మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్, నిర్మాతను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు.

దీనిపై నిర్మాత శిరీష్ నిన్న రాత్రి లేఖ ద్వారా క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని, మెగా అభిమానుల మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదంటూ పేర్కొన్నారు. గేమ్ ఛేంజర్ షూటింగ్ టైంలో రామ్ చరణ్ తమకు పూర్తి సమయాన్ని కేటాయించి, సహకారం అందించారని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రతిష్టకు భంగం కలిగించేలా తాను ఎప్పటికీ మాట్లాడనని శిరీష్ హామీ ఇచ్చారు. ఒకవేళ తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధ పెట్టించి ఉంటే, అందుకు క్షమించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

 

ఇక ఈ వ్యవహారంపై శిరీష్ స్వయంగా కొద్దిసేపటి క్రితం వీడియోను విడుదల చేశారు. మెగాస్టార్ కుటుంబంతో తమకు ఎన్నో ఏళ్ల నుంచి సాన్నిహిత్యం ఉంది. మేము చిరంజీవి, రామ్ చరణ్, మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడమని తెలిపారు. ఒకవేళ తన మాటలతో ఎవరి మనోభావాలను దెబ్బతీసేలా ఉంటే.. అందుకు క్షమించండి. తాను అభిమానించే హీరోలలో రామ్ చరణ్ ఒకరు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ తో కూడా సినిమాలు చేశాం. అనుబంధం ఉన్న వారిని అవమానించే మూర్ఖుడిని కాదని, సంక్రాంతికి వస్తున్నాం సినిమాని పొంగల్ కి విడుదల చేయొద్దని చెప్పి ఉంటే చేసే వాళ్లం కాదు. మంచి మనస్సున్న వ్యక్తి కాబట్టే మా గురించి ఆలోచించారని అన్నారు.

 

 

ఇవి కూడా చదవండి: