Published On:

Manchu Vishnu: ‘కన్నప్ప’పై మంచు విష్ణు ఎమోషనల్ ట్వీట్

Manchu Vishnu: ‘కన్నప్ప’పై మంచు విష్ణు ఎమోషనల్ ట్వీట్

Kannappa Movie: ఎన్నో అంచనాల మధ్య మంచు విష్ణు లీడ్ రోల్ చేసిన కన్నప్ప మూవీ ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మూవీకి సంబంధించి థియేటర్ లో పాజిటీవ్ టాక్ వస్తోంది. ఇండియాతో పాటు సినిమా విడుదలైన ప్రతిచోటా మంచి రివ్యూలు వస్తున్నాయి. దీంతో మూవీ హీరో మంచు విష్ణు ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఫేమస్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈ సినిమాలో శివ భక్తుడైన కన్నప్ప టైటిల్ రోల్ విష్ణు చేయగా, ప్రభాస్ రుద్రగా, మోహన్ లాల్ కిరాతగా, అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా నటించారు.

 

పదేళ్లుగా ఈమూవీ కోసం విష్ణు పనిచేస్తున్నాడు. పలు సందర్భాల్లో సినిమాకు సంబంధించిన పోస్టులతో ఆడియన్స్ ను ఆకట్టుకునేవాడు. సినిమాకు హీరోగానే కాకుండా.. స్క్రీన్ ప్లే బాధ్యతలు కూడా భుజాన వేసుకున్నాడు. ఈ మూవీలో విష్ణు డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ నటన, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నట్టు టాక్. సినిమా చివరి 30 నిమిషాల్లో విష్ణు నటన అద్భుతంగా ఉందటున్నారు ఆడియన్స్. దీంతో తన ఆనందాన్ని ట్వీట్ ద్వారా పంచుకున్నారు.

 

“ఈ క్షణం కోసం నా జీవితమంతా ఎదురుచూశాను. ఓవర్సీస్ ప్రీమియర్స్ లో, ఇండియాలో ఫస్ట్ షోకు పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. ఆడియన్స్ ఈ సినిమాపై చూపుతోన్న అఖండమైన ప్రేమను చూస్తోంటే.. నా హృదయం కృతజ్ఞతా భావంతో నిండిపోయింది. కన్నప్ప ఇక నా సినిమా మాత్రమే కాదు.. ఈ క్షణం నుంచి ఇది మీ సినిమా” అని తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.

 

ఇవి కూడా చదవండి: