Prabhas: కన్నప్పలో ప్రభాస్ పెళ్లి ప్రస్తావన

Rudra In Kannappa Movie: మంచు విష్ణు లీడ్ రోల్ గా, డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ కాంబోలో రిలీజైన లేటెస్ట్ మూవీ కన్నప్ప. పలువురు టాలీవుడ్, బాలీవుడ్ నుంచి స్టార్ యాక్టర్స్ మూవీలో కీలక పాత్రలు చేశారు. వరల్డ్ వైడ్ గా ఇవాళ రిలీజైన ఈ మూవీకి పాజిటీవ్ టాక్ వస్తోంది. దీంతో మూవీ టీమ్ ఫుల్ ఖుషీ అవుతోంది. అయితే ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ గా మారుతోంది.
ముఖ్యంగా కన్నప్ప మూవీలో ప్రభాస్ చేస్తున్నాడు అనే విషయం తెలిసిన తర్వాత సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయింది. మూవీలో ప్రభాస్ రోల్ ఏంటీ, ఎలా ఉంటుంది అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు. అలాగే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ శివుడిగా కనిపించగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా నటించారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. మహాదేవ శాస్త్రిగా తన డైలాగ్స్ తో అదరగొట్టారు. మోహన్ లాల్, శరత్ కుమార్ నాథనాధుడిగా కీలక పాత్రలో కనిపించారు. హీరోయిన్ ప్రీతి ముకుంద్ కూడా అందరినీ మెప్పించింది. అయితే మూవీలో అందరి చూపు ప్రభాస్ చేస్తున్న రుద్ర క్యారెక్టర్ పైనే ఉంది.
ఈ మూవీలో రుద్ర అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ప్రభాస్ కనిపించాడు. దాదాపు 40 నిమిషాలపాటు సాగే ప్రభాస్ ఎపిసోడ్ డైలాగ్స్ ను రైటర్ అద్భుతంగా తీర్చిదిద్దాడు. ముఖ్యంగా ప్రభాస్ పెళ్లికి సంబంధించి డైలాగ్ కు థియేటర్ లో నవ్వులు పూయించాయి. ఇక చివరిలో కన్నప్పగా తిన్నడు శివుడికి కన్ను దానం చేసే సీన్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. మంచు విష్ణు తన నటనతో ఆడియన్స్ ను కంటతడి పెట్టించాడు. బీజీఎం కూడా పర్వలేదనిపించింది. విఎఫ్ఎక్స్, ప్రొడక్షన్ కూడా పర్వలేదు. మొత్తానికి సినిమా మాత్రం సూపర్ అని చెప్పొచ్చు.