Published On:

Allari Naresh: ‘ఆల్కహాల్’లో పీకలోతు మునిగిన అల్లరి నరేష్ .. ఫస్ట్ లుక్ పోస్టర్ మామూలుగా లేదుగా!

Allari Naresh: ‘ఆల్కహాల్’లో పీకలోతు మునిగిన అల్లరి నరేష్ .. ఫస్ట్ లుక్ పోస్టర్ మామూలుగా లేదుగా!

Allari Naresh new movie Alcohol First Look Released: టాలీవుడ్ కమెడియన్ హీరో అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ప్రేక్షకులకు కమెడియన్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల డిఫరెంట్ రోల్స్ ఉన్న సినిమాలను ఎక్కువగా ఎంచుకుంటున్నాడు. నాంది, రైల్వే వంటి సీరియస్ సినిమాల్లో నటించి అందరి మన్ననలు పొందుతున్నాడు. తాజాగా, ‘ఆల్కహాల్’ సినిమాతో ముందుకొస్తున్నాడు.

 

ఇందులో భాగంగానే, ‘ఆల్కహాల్’ సినిమాకు సంబంధించి మేకర్స్ అప్డేట్ ప్రకటించారు. అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా 63వ సినిమా టైటిల్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ మేరకు మేకర్స్ పోస్టర్ విడుదల చేయగా.. అందులో సగం వరకు నిండిన ఆల్కహాల్ ‌లో అల్లరి నరేష్ మునిగినట్లు ఉంది. అయితే దీని ఆధారంగా సినిమా ఉంటుందని హింట్ ఇచ్చారు.

 

ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియూస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తుంది. ఇందులో రుహాని శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. గిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వెంకట్ ఉప్పుటైరి సహ నిర్మాతగా.. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి: