Published On:

Thammudu Trailer: ఆసక్తి పెంచుతున్న నితిన్ ‘తమ్ముడు’ ట్రైలర్

Thammudu Trailer: ఆసక్తి పెంచుతున్న నితిన్ ‘తమ్ముడు’ ట్రైలర్

Tollywood: టాలీవుడ్ యంగ్ స్టార్ నితిన్ హీరోగా, సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీరామ్ వేణు కాంబోలో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ మూవీ ‘తమ్ముడు’. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొనగా, తాజాగా విడుదలైన రిలీజ్ ట్రైలర్ మాత్రం ఆ అంచనాలను మరింతగా పెంచేస్తోంది. ఇంటెన్స్ ఎమోషన్స్, గట్టిగా తాకే డైలాగ్స్, పక్కా యాక్షన్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో నితిన్ తన అక్క కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడే తమ్ముడుగా కనిపించనున్నాడు. ఆమె ఆపదలో ఉన్నట్టు తెలిసిన క్షణం నుంచే అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అన్నదే ఈ కథ.

 

మూవీలో సౌరబ్ సచ్ దేవా విలన్ క్యారెక్టర్ తో అగ్రెసివ్ షేడ్స్ తో కనిపించి సినిమాకు మరింత టెన్షన్ తెస్తున్నారు. ట్రైలర్ లో ఆయన బాడీ లాంగ్వేజ్, యాక్షన్ ప్రేక్షకులను ఎంతగానో అకట్టుకునేలా ఉంది. సినిమాకు అజనీష్ లోకనాథ్ అందించిన సంగీతం మరో హైలెట్ గా చెప్పవచ్చు. ఆయన ఇచ్చిన బీజీఎం ట్రైలర్ ను మరో లెవల్ కి తీసుకెళ్లిందని చెప్పొచ్చు. థియేటర్ లో ఈ స్కోర్ ప్రేక్షకులను ఒక ఎమోషనల్ ట్రాన్స్ లోకి తీసుకెళ్తుందని అనిపిస్తోంది. దిల్ రాజు సమర్పణలో రూపొందిన ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోందని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. కాగా జులై 4న మూవీ రిలీజ్ కాబోతుండగా ఈ సినిమా నితిన్ కి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి మరి.

 

 

ఇవి కూడా చదవండి: